BJP Rajasthan : రాజస్థాన్ బీజేపీపై ట్రబుల్ షూటర్ ఫోకస్
రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై కీలక భేటీ
BJP Rajasthan : దేశంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. కాంగ్రెస్ ఇప్పటికే ప్రజల వద్దకు చేరుకునేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు భారత్ జోడో యాత్రను ప్రారంభించింది.
దీనికి అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తూ ముందుకు సాగుతున్నాడు. మరో వైపు భారతీయ జనతా పార్టీ(BJP Rajasthan) ఇప్పటి నుంచే టార్గెట్ పెట్టుకుంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 350 సీట్లు తప్పనిసరిగా రావాలని వార్నింగ్ ఇచ్చారు పార్టీ ప్రధాన వ్యూహకర్త, టార్చ్ బేరర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా.
అంతే కాకుండా త్వరలో జరగబోయే ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో సైతం సత్తా చాటేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా అమిత్ షా నేరుగా రంగంలోకి దిగారు.
రాజస్థాన్ సీఎం హోం టర్ఫ్ లో బీజేపీ(BJP Rajasthan) సమావేశం కానుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ఓబీసీ ఓటు బ్యాంకును బలోపేతం చేయడమే లక్ష్యంగా సాగనుంది.
ఇదిలా ఉండగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సొంత గడ్డ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నియోజకవర్గమైన జోధ్ పూర్ లో ఓబీసీ మోర్చా రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాన్ని చేపట్టింది.
పశ్చిమ ప్రాంతంలో కూడా తమ బలాన్ని మరింత పెంచు కోవాలని చూస్తోంది. మాలి కమ్యూనిటీకి చెందిన గెహ్లాట్ గణనీయమైన ఉనికి చాటుకున్నారు.
సమావేశం ముగిసిన వెంటనే జోధ్ పూర్ లో అమిత్ షా ప్రసంగించనున్నారు. మొత్తంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టనున్నారు.
Also Read : బీజేపీ ఫోకస్ కమలనాథులకు టార్గెట్