TS Govt JOBS : ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఓకే
ఆర్థిక శాఖ క్లియరెన్స్
TS Govt JOBS : ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వారికి ఖుష్ కబర్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం(TS Govt JOBS). ఇప్పటికే ఆర్థిక శాఖ దశల వారీగా క్లియరెన్స్ ఇస్తూ పోతోంది.
కానీ ఒక్క పోస్టు కూడా ఇంతవరకు భర్తీ కాలేదు. నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుందామన్నా ఒక్కటి ఓపెన్ కావడం లేదని వాపోతున్నారు.
ఈ తరుణంలో తాజాగా 1,663 పోస్టు భర్తీకి పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి దాకా 46, 988 ఉద్యోగాల భర్తీకి క్లియరెన్స ఇచ్చింది.
ఇటీవల పోలీస్ , ఫారెస్ట్ , ఫైర్ , జైళ్లు, రవాణా, ఎక్సైజ , పంచాయతీరాజ్ , మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , సాంఘిక సంక్షేమం, విద్య, ఆరోగ్య శాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతి ఇచచింది.
ప్రస్తుతం నీటి పారుదల, ఆర్ అండ్ బి శాఖలలోని 1,522 ఇంజరీంగ్ పోస్టులతో పాటు మరికొన్ని కొలువులకు క్లియరెన్స్ ఇచ్చింది. నీటి పారుదల శాఖలో 704 ఏఈఈ పోస్టులు, 227 పోస్టులు ఉన్నాయి.
ఇక వీటితో పాటు 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అంతే కాకుండా 95 టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి.
ఇక భూగర్భ జల శాఖలో 88 పోస్టులు, రోడ్లు భవనాల శాఖలో 38 సివిల్ ఏఈ పోస్టులు, 145 సివిల్ ఏఈఈ పోస్టులు, 13 ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులు, 60 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
27 టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ తో పాటు ఆర్థిక శాఖలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
కానీ ప్రకటిస్తూ పోతున్నారే తప్పా భర్తీ చేయక పోవడంపై నిరుద్యోగులు మండి పడుతున్నారు.
Also Read : హైదరాబాద్ అద్భుతమైన నగరం – మోదీ