TS Govt Shock : తెలంగాణ పంతుళ్లు ఆస్తులు చెప్పాల్సిందే
విద్యా శాఖ సంచలన నిర్ణయం
TS Govt Shock : ఇప్పటికే సరైన వసతులు లేక నానా తంటాలు పడుతున్నారు విద్యార్థులు. విద్యా సంవత్సరం ఆర్భాటంగా ప్రారంభమైనా, ఆంగ్ల బోధనకు ఓకే చెప్పినా ఇప్పటి వరకు ఆయా బడులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ తరుణంలో పంతుళ్లు పాఠాల కంటే బయటి వ్యవహారాలలో ఎక్కువగా తల దూర్చుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
దీంతో నల్లగొండ జిల్లాకు చెందిన ఓ హెడ్మాస్టర్ లెక్కకు మించి ఆస్తులు కూడ బెట్టాడని, రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నట్లు విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని విద్యా శాఖ వెల్లడించింది.
ఆ మేరకు ఇక నుంచి ప్రతి ఏటా తమ ఆస్తుల వివరాలు చెప్పాల్సిందేనంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాట్లు, ఫ్లాట్స్ , ఇళ్లు, బంగారం, బైక్ లు ఇలా ఏది కొనుగోలు చేసినా ముందస్తుగా తెలంగాణ ప్రభుత్వం(TS Govt Shock) అనుమతి తీసుకోవాలంటూ పేర్కొంది.
దీంతో పంతుళ్లు పరేషాన్ లో పడ్డారు. ఇకపై టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్ము కోవాలంటే లేదా కొనుగోలు చేయాలంటే సర్కార్ పర్మిషన్(TS Govt Shock) తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది.
తమను అడుగుతున్నారు సరే పొలిటికల్ లీడర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇది వర్తించదా అంటున్నారు మరికొందరు టీచర్లు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి పాఠశాల హెచ్ఎం జావేద్ , సోదరుడి మధ్య భూ వివాదం చోటు చేసుకుంది.
ఇద్దరూ పలుకుబడి కలిగిన వారే కావడంతో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. విజిలెన్స్ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read : సీఎం జగన్ వల్లే సాధ్యమైంది