MP Avinash Reddy : అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు
వివేకానంద రెడ్డి హత్య కేసు
MP Avinash Reddy : ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాయన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సీబీఐ రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న వైసీపీకి చెందిన అవినాష్ రెడ్డిని(MP Avinash Reddy) పలుమార్లు ప్రశ్నించింది. ఇదే సమయంలో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. కోర్టు రిమాండ్ విధించింది.
ఈ తరుణంలో తనను పదే పదే సీబీఐ ప్రశ్నించడాన్ని తప్పు పట్టారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఈ మేరకు తనకు వెసులుబాటు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు ఎంపీకి ఊరటనిచ్చింది. ఏప్రిల్ 25 వరకు అవినాష్ రెడ్డిని విచారించ వద్దని ఆదేశించింది.
అరెస్ట్ చేయవద్దంటూ స్పష్టం చేసింది. ఇక విచారణలో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థకు స్పష్టమైన సూచనలు పేర్కొంది. ఎంపీ విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రూపంలో రికార్డింగ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు ఆరోజు వెలువరిస్తామని కోర్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇప్పటికే అరెస్ట్ చేసిన భాస్కర్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డిని(MP Avinash Reddy) కలిపి విచారిస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది.
Also Read : బీఆర్ఎస్ లో నరకం చూశా