Bandi Sanjay TS High Court : ‘బండి’కి హైకోర్టు లైన్ క్లియర్
కానీ కండీషన్స్ అప్లై చేయాల్సిందే
Bandi Sanjay TS High Court : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ కు (Bandi Sanjay TS High Court) ఊరటనిచ్చింది రాష్ట్ర హైకోర్టు. ఈ మేరకు తాను చేపట్టిన పాదయాత్రకు ఖాకీలు అడ్డు పడ్డారని, ఆపై వెళ్లనీయకుండా నానా రభస చేశారంటూ ఆరోపించారు బండి. ఆరు నూరైనా తాను పాదయాత్ర చేపడతానంటూ శపథం చేశారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని రాచరిక పాలన సాగుతోందని ఆరోపించారు. భైంసాలో పరిస్థితులు బాగో లేవని , శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందంటూ నిర్మల్ ఎస్పీ స్పష్టం చేశారు. ఈ మేరకు బండి పాదయాత్రకు అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. దీనిపై నిప్పులు చెరిగారు బీజేపీ స్టేట్ చీఫ్.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేపట్ట వచ్చని, కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ కావాలని తన యాత్రను అడ్డుకుంటోందంటూ ఆరోపించారు బండి సంజయ్. తనకు పర్మిషన్ ఇవ్వక పోవడాన్ని నిరసిస్తూ హైకోర్టును(Bandi Sanjay TS High Court) ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన ధర్మాసనం లైన్ క్లియర్ ఇచ్చింది.
కానీ కొన్ని కండీషన్స్ కు లోబడి మాత్రమే పాదయాత్ర చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు, ప్రసంగాలు చేయవద్దంటూ హెచ్చరించింది. అయితే భైంసాలో కాకుండా దాని పక్కన ఎక్కడైనా సరే బహిరంగ సభ నిర్వహంచు కోవచ్చంటూ తెలిపింది.
కాగా పాదయాత్ర భైంసా పట్టణం మీదుగా వెళ్లకూడదంటూ కోర్టు ఆదేశించింది బండి సంజయ్ ని. ఇదే సమయంలో పోలీసులను కూడా కోర్టు సీరియస్ గా ఉండాలంటూ స్పష్టం చేసింది. లా అండ్ ఆర్డర్ ముఖ్యమని పేర్కొంది.
Also Read : నోటిఫికేషన్లు సరే కొలువుల జాడేది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు @bandisanjay_bjp అన్న గారు ఐదవ విడుత ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరికాసేపట్లో కరీంనగర్ నుండి భైంసా బయలు దేరనున్నా సంజయ్ అన్న… pic.twitter.com/4Ecv6ax1v2
— BJP IT Cell Telangana (@BJPITCellTS) November 28, 2022
Also Read : నోటిఫికేషన్లు సరే కొలువుల జాడేది