TS Inter Results 2022 : తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
రిలీజ్ చేసిన విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి
TS Inter Results 2022 : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్ష ఫలితాలు రిలీజ్ చేశారు. మంగళవారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి రిజల్ట్స్ విడుదల(TS Inter Results 2022) చేశారు.
ఇదిలా ఉండగా ఇంటర్ పరీక్షలు గత మే నెల 6వ తేదీన ప్రారంభమయ్యాయి. 24న ముగిశాయి. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ , సెకండ్ ఇయర్ తో కలుపుకుని మొత్తం 9,07, 393 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఫలితాలకు సంబంధించి విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లో చూసు కోవాలని ఇంటర్ బోర్డు ప్రకటించింది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే వెంటనే ఫలితాలు వస్తాయి. వాటిని ప్రింట్ తీసుకోవచ్చని తెలిపింది.
కాగా పరీక్షా ఫలితాలను చూస్తే ఫస్టియర్ లో 63.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండ్ ఇయర్ లో 67.16 శాతం పాస్ అయ్యారు. మొత్తంగా ఇంటర్ ఫస్ట్ , సెకండ్ ఇయర్లు కలిపితే 62 శాతంగా ఉత్తీర్ణత నమోదైంది.
ఇక ఫస్టియర్ లో 4,64,892 మంది హాజరు కాగా వీరిలో 2,94,278 మంది పాస్ అయ్యారు. వోకేషన్ కోర్సులకు సంబంధించి 50,512 మంది ఎగ్జామ్స్ రాస్తే 25,615 మంది ఉత్తీర్ణత సాధించారు.
54.25 శాతం నమోదైంది. ఇంటర్ లో ఈసారి బాలికలు సత్తా చాటారు. మొత్తం వీరి శాతం 72.33 గా ఉంది. ఇక బాలుర శాతం 54.25 శాతంగా నమోదైంది.
ఇదే సమయంలో సెకండ్ ఇయర్ చూస్తే 4,42,895 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీఈరిలో 2,97,458 మంది పాస్ అయ్యారు. ఇందులో బాలికలు 75.33 శాతం , బాలురు 59.21 శాతం ఉత్తీర్ణత పొందారు.
Also Read : కొలువుల భర్తీలో నో కాంప్రమైజ్
Please Click : Telangana Inter Results