TS Govt Jobs : గ్రూప్స్ లో మరిన్ని పోస్టులకు సర్కార్ ఓకే
ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
TS Govt Jobs : అసెంబ్లీ సాక్షిగా 82 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు సీఎం. ఈ మేరకు లక్షలాది మంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్లు వేయడం తప్ప ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. దీంతో ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు జాబ్స్ రావని డిసైడ్ అయ్యారు నిరుద్యోగులు.
మరోవైపు మరో 10 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని అంతా అలర్ట్ గా ఉండాలంటూ ప్రకటన చేయడంతో కొలువులు రావని తేలి పోయింది. తాజాగా నిరుద్యోగులను ఊరించడం తప్ప ఇంకేమీ లేదంటున్నారు బాధితులు. ఇక త్వరలో గ్రూప్ -2, 3, 4 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు గురువారం పేర్కొంది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ప్రకటించిన వాటితో పాటు మరికొన్ని పోస్టులను(TS Govt Jobs) అదనంగా చేరుస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా గ్రూప్ -2లో కొత్తగా ఆరు రకాల పోస్టులను చేర్చితే , గ్రూప్ -3లో రెండు రకాల పోస్టులు, గ్రూప్ -4 లో నాలుగు రకాల పోస్టులను అదనంగా భర్తీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇక సవరించిన పోస్టులు ఇలా ఉన్నాయి. గ్రూప్ -2లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ , జువైనల్ డిస్ట్రిక్ ప్రొబేషనర్ ఆఫీసర్ , అసిస్టింట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ , అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ , అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
ఇక గ్రూప్ -3లో గిరిజన సంక్షేమ శాఖలో అకౌంటెంట్ , సీనియర్ అసిస్టెంట్ , అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ , అకౌంటెంట్ పోస్టులు చేర్చింది. గ్రూప్ -4లో జూనియర్ అసిస్టెంట్ , అకౌంటెంట్ , జువైనల్ సర్వీసెస్ సూపర్ వైసజర్ , మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్ జాబ్స్ ఉన్నాయి.
Also Read : జామా మసీదు నిషేధంపై స్వాతి మలివాల్ ఫైర్