TS Teacher Transfers : 27 నుంచి బ‌దిలీలు..ప‌దోన్న‌తులు

షెడ్యూల్ విడుద‌ల చేసిన తెలంగాణ స‌ర్కార్

TS Teacher Transfers : తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు రాష్ట్రంలో ప‌ని చేస్తున్న టీచ‌ర్ల ట్రాన్స్ ఫ‌ర్స్ , ప్ర‌మోష‌న్స్ కు సంబంధించి షెడ్యూల్ విడుద‌ల చేసింది. జ‌న‌వ‌రి 27 నుంచి ప్ర‌క్రియ ప్రారంభం కానుంది.

ఆన్ లైన్ లో 28 నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నుంది. ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు రాష్ట్ర విద్యా శాఖ క‌స‌ర‌త్తు ప్రారంభించింది. త్వ‌ర‌లో టీచ‌ర్ల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఉండ‌డంతో దీనిని ముందుకు తెచ్చిందంటూ విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్ర‌క్రియ మొత్తం 37 రోజుల్లో ముగియ‌నుంద‌ని విద్యా శాఖ చెబుతోంది.

ఇదిలా ఉండ‌గా 27 నుంచే ట్రాన్స్ ఫ‌ర్స్ ప్రారంభం కానుంది. తొలి రోజు సీనియార్టీ లిస్టును వెల్ల‌డిస్తారు. 28 నుంచి 30 దాకా ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు. మార్చి 4 నాటికి పూర్త‌వుతుంద‌ని అంచ‌నా.

మార్చి 5 నుంచి 19 దాకా అప్పీలు చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చారు. వీటిని 15 రోజుల్లో ప‌రిష్క‌రిస్తారు. ఈ మొత్తం ప్ర‌క్రియ పూర్తిగా పార‌దర్శ‌కంగా ఉండాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 9 వేల మందికి పైగా టీచ‌ర్ల‌కు ప్ర‌మోష‌న్స్(TS Teacher Transfers)  ద‌క్క‌నున్నాయి.

ప్ర‌ధానోపాధ్యాయుల స్థానంలో ఎస్ఏల‌కు , ఎస్ఏల స్థానంలో ఎస్జీటీల‌కు చాన్స్ ఇస్తారు. దీని వ‌ల్ల 2,013 మంది హెడ్మాస్ట‌ర్లు, 4,163 స్కూల్ అసిస్టెంట్లు , ఇత‌ర 2,500 మందికి పైగా ప‌దోన్న‌తులు ల‌భించ‌నున్న‌ట్లు స‌మాచారం.

బ‌దిలీలు, ప్ర‌మోష‌న్స్ కార‌ణంగా 40 శాతం మందికి పైగా స్థాన చ‌ల‌నం క‌ల‌గ‌నుంది. ఇప్ప‌టికే విద్యా శాఖ డిఇఓల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండ‌గా ఇదంతా కేవ‌లం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోస‌మే చేస్తోందంటున్నారు ప్ర‌తిప‌క్షాలు.

Also Read : వెల్లువ‌లా పెట్టుబ‌డులు వేలాది కొలువులు – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!