TSPSC Paper Leak : అభ్యర్థులకు షాక్ ఏఈ పరీక్ష రద్దు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం
TSPSC AE Cancel : వరుస వివాదాలకు కేరాఫ్ గా మారింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ. ఇప్పటికే పరీక్ష లీకుల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొన్న ప్రస్తుత తరుణంలో గతంలో జరిగిన పరీక్షలు, ఫలితాలపై భగ్గుమంటున్నారు నిరుద్యోగులు. పరీక్షలు రాసిన అభ్యర్థులు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, యువజన, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఏకంగా బీజేవైఎం ఆధ్వర్యంలో టీఎస్ పీఎస్సీ బోర్డును పీకేశారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ మొత్తం వ్యవహారంపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష చేపట్టారు. అనంతరం టీఎస్ పీఎస్సీ చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి చిలుక పలుకులు పలికారు. పేపర్ లీక్ కు సంబంధించి వెంటనే రాజీనామా చేయాలని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ , ఎస్డీఎఫ్ కన్వీనర్ ఆకునూరి మురళి , టీజీఎస్ చీఫ్ కోదండరామ్ డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడిన చైర్మన్ జనార్దన్ రెడ్డి సిట్ ను సర్కార్ ఏర్పాటు చేసిందన్నారు. ఈ లీక్ కు సంబంధించి 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గ్రూప్ -1 మెయిన్స్ యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు చైర్మన్.
ఉన్నట్టుండి సంచలన ప్రకటన చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సంస్థ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) ను ఇప్పటికే నిర్వహించింది. ఇందుకు సంబంధించిన పేపర్ లీక్ అయినట్లు నిర్దారణ కావడంతో దీనిని రద్దు(TSPSC AE Cancel) చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉండగా మార్చి 5న ఏఈ పరీక్ష జరిగింది. త్వరలోనే ఈ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించేది తెలియ చేస్తామని వెల్లడించింది. మొత్తం 837 పోస్టుల భర్తీ కోసం 55 వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాశారు.
Also Read : కవితపై థర్డ్ డిగ్రీ నిజమేనా