Janardhan Reddy TSPSC : రాజశేఖర్ రెడ్డి ఎక్స్ పర్ట్ ప్రవీణ్ ఖతర్నాక్
వెల్లడించిన టీఎస్ పీఎస్సీ చైర్మన్
Janardhan Reddy TSPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) లో చోటు చేసుకున్న పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణలో కలకలం రేపింది. భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఆందోళనలు మిన్నంటాయి. స్వయంగా కమిషన్ చైర్మన్, సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు బండారం బట్ట బయలు అయ్యింది. ఇందుకు సంబంధించి సదరు సంస్థ చైర్మన్ ఎవరు ఎలా చేశారనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తమ సంస్థలో కంప్యూటర్లు లీక్ అయిన వ్యవహారం గురించి తామే గుర్తించామని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు వెల్లడించారు. టీఎస్ పీఎస్సీలో రాజశేఖర్ రెడ్డి(Janardhan Reddy TSPSC) గత ఆరు సంవత్సరాల నుంచి ఔట్ సోర్సింగ్ పద్దతిన పని చేస్తున్నాడని తెలిపారు. కార్యాలయంలోని కంప్యూటర్లకు చెందిన ఐపీ అడ్రస్ లు తెలుసుకుని ఇలాంటి ప్లాన్ కు తెర తీశారన్నారు జనార్దన్ రెడ్డి.
టెక్నికల్ గా ఎక్స్ పర్ట్ కావడంతో పాటు కార్యదర్శి పీఎస్ గా ఉన్న ప్రవీణ్ కలిసి కుట్రకు తెర తీశారని ఆరోపించారు. రేణుకకు ప్రవీణ్ చేర వేశాడని, పోలీసుల దర్యాప్తులో 9 మంది నిందితులుగా తేలారని చెప్పారు. ప్రవీణ్ రూ. 10 లక్షలకు పేపర్లు అమ్ముకున్నట్లు తమకు తెలిసిందన్నారు చైర్మన్. ఆ ఇద్దరిపై వేటు వేశామని ఇంకా ఎంత మంది ఉన్నారనే దానిపై సిట్ కు సర్కార్ ఆదేశించిందని వెల్లడించారు. చైర్మన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read : ఇంటర్ పరీక్షలకు వేళాయెరా