TSPSC Group1 : గ్రూప్ -1 దరఖాస్తుల గడువు పెంపు
జూన్ 4 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు
TSPSC Group1 :తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిష్టాత్మకంగా భావించే గ్రూప్ -1 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించింది.
ఈ విషయాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC Group1) (టీఎస్పీఎస్సీ ) వెల్లడించింది. అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఈనెల 4 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా మే 31 వరకు మాత్రమే అవకాశం ఉండింది. చాలా మంది అభ్యర్థులు చేసిన విన్నపాల మేరకు దరఖాస్తు చేసే గడువును పొడిగించినట్లు స్పష్టం చేసింది.
ఫీజుల చెల్లింపు విషయంలో సమస్యలు కొన్ని తలెత్తడం పై ఫిర్యాదులు అందాయని కమిషన్ పేర్కొంది. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ గ్రూప్ -1(TSPSC Group1) పోస్టులకు సంబంధించి 503 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇప్పటి దాకా 3, 48, 095 అప్లికేషన్లు వచ్చాయని తెలిపింది కమిషన్. ఆఖరు రోజు ఏకంగా 50 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. 2011లో రాష్ట్రం ఏర్పడక ముందు గ్రూప్ -1 నోటిఫికేషన్ ప్రకటిస్తే 312 పోస్టులకు గాను 3,02,912 అప్లికేషన్లు వచ్చాయి.
కానీ ఆ రికార్డును ఈసారి అధిగమించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓటీఆర్ నమోదు, ఎడిట్ చేసుకున్న అభ్యర్థుల సంఖ్య ఏకంగా 5, 58, 275కి చేరడం విశేషం.
ఇదిలా ఉండగా సీఎం ప్రకటించిన విధంగా 85 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు పోలీస్, రవాణా, గ్రూప్ -1 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు మాత్రమే వచ్చాయి. జూనియర్ అసిస్టెంట్, ఇతర పోస్టులకు నోటిఫికేషన్లు రాలేదు.
వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
Also Read : బోధనేతర పోస్టుల భర్తీకి ఛాన్స్