TSPSC ICDS JOBS : మహిళా అభ్యర్థులకు మంచి ఛాన్స్
181 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ జాబ్స్
TSPSC ICDS JOBS : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది పలు పోస్టులకు. అందులో భాగంగా రాష్ట్ర మహిళా అభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 181 పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది.
విచిత్రం ఏమిటంటే నోటిఫికేషన్లు ఇస్తున్నామని ప్రకటిస్తున్నారే తప్పా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదని అంటున్నారు నిరుద్యోగులు. ఇక పోస్టుల విషయానికి వస్తే ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ( సూపర్ వైజర్ ) గ్రేడ్ -1 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది.
ఈ పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ )(TSPSC ICDS JOBS) పరీక్షలు నిర్వహించనుంది. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష ఉండనుంది. అయితే ఈ పోస్టులకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
పురుష అభ్యర్థులకు నో చాన్స్ . టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఈనెల 10 నుంచి దరఖాస్తులు ప్రారంభం అవుతాయని తెలిపింది.
కానీ దానిని మారుస్తూ సెప్టెంబర్ 13 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. ఇక ఈ సూపర్ వైజర్ గ్రేడ్ -1 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచ్ లర్ డిగ్రీ చేసి ఉండాలి.
హోమ్ సైన్స్ , సోషల్ వర్క్, సోషియాలజీ చదివిన వారే అర్హులు. లేదా బీఎస్సీ ఫుడ్ సైన్స్ , న్యూట్రిషన్ , బోటనీ, జువాలజీ , కెమిస్ట్రీ, అప్టైడ్ న్యూట్రిషన్ పబ్లిక్ హెల్త్ , బోటనీ జువాలజీ చేసి ఉండాలి. 44 ఏళ్ల లోపు ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్ల వయో పరిమితి ఉంటుందని. జీతం నెలకు రూ. 35,720 నుంచి రూ. 1,04,430 దాకా చెల్లిస్తారు. పరీక్ష డిసెంబర్ లో చేపడతారు.
Also Read : టి20 వరల్డ్ కప్ జట్టుపై ఉత్కంఠ