TSPSC Group-2 Exam : ఆగ‌స్టు 29,30 ల‌లో గ్రూప్ -2 ఎగ్జామ్

పెద్ద ఎత్తున ద‌ర‌ఖాస్తులు

TSPSC Group-2 Exam Time Table : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కు నిరుద్యోగుల తాకిడి ఎక్కువైంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ల‌కు పెద్ద ఎత్తున ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. తాజాగా గ్రూప్ -2 ఎగ్జామ్ ద‌ర‌ఖాస్తు చేసుకునే ప్ర‌క్రియ ముగిసింది. దీంతో దిమ్మ తిరిగేలా భారీ ఎత్తున ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం విస్తు పోయేలా చేసింది. రాష్ట్రంలో నిరుద్యోగ ప‌రిస్థితి ఏ విధంగా ఉందో దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. 

గ్రూప్ -2కు సంబంధించి మొత్తం 783 పోస్టులు ఉన్నాయి. ఒక్కో పోస్టుకు పెద్ద ఎత్తున పోటీ ప‌డుతుండ‌డం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు నోటిఫికేష‌న్ తేదీ ముగిసే నాటికి 5,52,943 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇక గ్రూప్ -2 లో కీల‌క‌మైన పోస్టులు (TSPSC Group-2) ఉన్నాయి.  దీంతో నిరుద్యోగులు వీటికే ప్ర‌యారిటీ ఇచ్చారు. 

మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ గ్రేడ్ -3 , స‌బ్ రిజిస్ట్రార్ గ్రేడ్ -2 , కోఆప‌రేటివ్ సొసైటీ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ , అసిస్టెంట్ క‌మర్షియ‌ల్ ఆఫీస‌ర్ , డిప్యూటీ త‌హ‌సిల్దార్ , స‌హాయ లేబ‌ర్ అధికారి, ఎంపీడీఓ, ఎక్సైజ్ స‌బ్ ఇన్స్ పెక్ట‌ర్ , అసిస్టెంట్ సోష‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ పోస్టులు ఉన్నాయి. ఫిబ్ర‌వ‌రి 16 వ‌ర‌కు ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ముగిసింది.

తెలంగాణ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గ్రూప్ -2 పోస్టుల‌కు సంబంధించి వ‌చ్చే ఆగ‌స్టు 29,30 ల‌లో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది(TSPSC Group-2 Exam Time Table).

మొత్తం నాలుగు పేప‌ర్లు ఉంటాయ‌ని పేర్కొంది. ఒక్కో పేప‌ర్ లో 150 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ఒక్కో ప్ర‌శ్న‌కు ఒక్కో మార్కు చొప్పున 600 మార్కుల‌కు ప‌రీక్ష రుగుతుంది.  పేప‌ర్ -1 లో జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ , పేప‌ర్ -2 చ‌రిత్ర, రాజ‌కీయం, స‌మాజం ఉంటుంది. 

ఇక పేప‌ర్ -3 లో ఆర్థిక వ్య‌వ‌స్థ‌, అభివృద్ది, పేప‌ర్ -4లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం కు సంబంధించిన ప్ర‌శ్న‌లు ఉంటాయి.

Also Read : ఐసెట్ 2023 నోటిఫికేష‌న్ రిలీజ్

Leave A Reply

Your Email Id will not be published!