TSPSC Group-4 Jobs : గ్రూప్ – 4 కు 9,51,321 ద‌ర‌ఖాస్తులు

రికార్డు స్థాయిలో టీఎస్పీఎస్సీకి అప్లై

TSPSC Group-4 Jobs : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం ఏ మేర‌కు ఉందో తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప్ర‌క‌టించిన గ్రూప్ – 4 ఉద్యోగాల‌కు సంబంధించి ఊహించ‌ని రీతిలో ద‌ర‌ఖాస్తులు అందాయి. ఈ ఏడాదిలో అత్య‌ధికంగా పోస్టుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం. గ‌త ఏడాది 2022 డిసెంబ‌ర్ లో గ్రూప్ – 4 లో ఉద్యోగాల(TSPSC Group-4 Jobs) భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది.

ఇందుకు గాను మొత్తం 8,180 పోస్టుల‌కు అప్లికేష‌న్లు స్వీక‌రించింది తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ) . ఇందుకు భారీ ఎత్తున ద‌ర‌ఖాస్తు ఫీజుల‌ను కూడా కేటాయించింది. ఇప్ప‌టికే ఉద్యోగాలు లేక స‌త‌మ‌తం అవుతున్న నిరుద్యోగుల పాలిట మ‌రింత బ‌రువుగా మారింది. ఈ ఒక్క గ్రూప్ – 4 జాబ్స్ కోస‌మే ఏకంగా 4, 51, 321 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి.

ఇది తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ హిస్ట‌రీలో ఓ రికార్డుగా చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో కిర‌ణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న స‌మ‌యంలో భారీ ఎత్తున జాబ్స్ భ‌ర్తీ ప్ర‌క్రియ జ‌రిగింది. ఆ త‌ర్వాత నుంచి నేటి దాకా అంత‌టి స్థాయిలో ఉద్యోగాలు భ‌ర్తీ చేసిన పాపాన పోలేదు. ఇదిలా ఉండ‌గా ఒక్కో పోస్టుకు భారీ ఎత్తున పోటీ ప‌డుతున్నారు.

మ‌రో వైపు హాస్ట‌ల్ వార్డెన్లు, మేట్ర‌న్ , సూప‌రింటెండెంట్ పోస్టుల‌కు కూడా ద‌ర‌ఖాస్తు గ‌డువు ముగిసింది. మొత్తం 581 పోస్టుల‌కు 1,45, 358 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ విష‌యాన్ని టీఎస్పీఎస్సీ అధికారికంగా ప్ర‌క‌టించింది.

గ్రూప్ -4 ఎగ్జామ్ జ‌రిగే తేదీని కూడా ప్ర‌క‌టించింది క‌మిష‌న్ . జూలై 1న నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇక హాస్ట‌ల్ వార్డెన్ , మ్యాట్రిన్ , సూప‌రింటెండెంట్ పోస్టుల‌కు సంబంధించి ఆగ‌స్టులో చేప‌డ‌తామ‌ని పేర్కొంది.

Also Read : తెలంగాణ ఎస్పీడీసీఎల్ లో 1,601 జాబ్స్

Leave A Reply

Your Email Id will not be published!