R Krishnaiah : బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య సంచలన కామెంట్స్ చేశారు. ఇంకా ఎంత మంది చని పోతే తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్లు జారీ చేస్తుందో చెప్పాలని అన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్దమైన సంస్థ అని. కానీ దానిని పూర్తిగా పోస్టాఫీస్ లాగా మార్చేశారంటూ నిప్పులు చెరిగారు. చదువులు పూర్తయి ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా ఈరోజు వరకు ఒక్క నోటిఫికేషన్ జారీ చేయలేదన్నారు.
రాష్ట్రంలో లక్షా 90 వేలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయని ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిషన్ స్పష్టం చేసిందన్నారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, కలెక్టరేట్లు ఏర్పడినా ఇంకా ఎందుకు ఖాళీలు నింపడం లేదని ప్రశ్నించారు కృష్ణయ్య(R Krishnaiah).
ఇవాళ హైదరాబాద్ లో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆర్ .కృష్ణయ్య మాట్లాడారు. ఒక్క చీఫ్ సెక్రటరీ ఆరు మంది ఐఏఎస్ ల పని చేస్తున్నాడని ఆరోపించారు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ధ్వజమెత్తారు. ఏ కార్యాలయానికి వెళ్లినా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. టీఎస్సీపీసీ రాజ్యాంగ బద్ద సంస్థ కానీ అది రబ్బరు స్టాంపుగా మారిందన్నారు.
పోస్టాఫీసు లాగా మారడం బాధాకరమన్నారు. గత 11 ఏళ్ల నుంచి రాష్ట్రంలో గ్రూప్ -1 నోటిఫికేషన్ రాలేదన్నారు. 6 ఏళ్ల నుంచి గ్రూప్ -2 నోటిఫికేషన్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు కృష్ణయ్య(R Krishnaiah).
బడుల్లో పాఠాలు చెప్పే పంతులు లేరన్నారు. 40 ఏళ్లు వచ్చినా రోడ్ల మీద తిరుగుతున్నారని ఆవేదన చెందారు కృష్ణయ్య.
Also Read : దొర పాలనలో నక్సల్స్ ఉంటే బావుండేది