TSPSC Leak : టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీకేజీపై సిట్

వ‌దంతులు న‌మ్మ‌కండన్న చైర్మ‌న్

TSPSC Paper Leak SIT : రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ లో పేప‌ర్ లీకేజీ(TSPSC Paper Leaks) వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. దాంతో అన్ని బోర్డుల‌తో పాటు టీఎస్ పీఎస్సీ చైర్మ‌న్ , కార్య‌ద‌ర్శి, స‌భ్యుల‌తో సీఎస్ శాంతి కుమారి స‌మీక్ష చేప‌ట్టారు. అనంత‌రం స‌ర్వీస్ క‌మిష‌న్ చైర్మ‌న్ జ‌నార్ద‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తాము ప‌రీక్ష‌లు ప‌క‌డ్బందీగా నిర్వ‌హించామ‌ని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. వదంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. య‌థావిధిగా గ్రూప్ -1 మెయిన్స్ ప‌రీక్ష జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మొత్తం వ్య‌వ‌హారానికి సంబంధించి విచార‌ణ‌ను సిట్ కు అప్ప‌గిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఈ లీక్ గురించి తామే ముందుగా పోలీసుల‌కు ఫిర్యాదు చేశామ‌ని చెప్పారు జ‌నార్ద‌న్ రెడ్డి. ఇక‌పై జ‌రిగే అన్నీ ప‌రీక్ష‌ల‌కు కొత్తగా ప్ర‌శ్నా ప‌త్రాల‌ను సిద్దం చేస్తామ‌న్నారు. త‌మ సైట్ లో 30 ల‌క్ష‌ల మంది ఓటీఆర్ న‌మోదు చేసుకున్నార‌ని తెలిపారు. త‌మ విధానాన్ని యుజీసి సైతం మెచ్చుకుంద‌న్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 35 వేల జాబ్స్ భ‌ర్తీ చేశామ‌ని ప్ర‌క‌టించారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో భ‌ర్తీ చేసేందుకు స‌ర్కార్ 23 వేల జాబ్స్ కు అనుమ‌తి ఇచ్చింద‌న్నారు. 17,136 జాబ్స్ కు నోటిఫికేష‌న్లు ఇచ్చామ‌న్నారు టీఎస్ పీఎస్సీ చైర్మ‌న్ జ‌నార్ద‌న్ రెడ్డి.

ఆయా పార్టీలు, సంఘాలు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌న్నారు. పూర్తిగా ప‌రీక్ష‌ల‌ను పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించాల‌ని తాము ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెప్పారు. అందులో భాగంగానే తామంత‌కు తామే ఫిర్యాదు చేశామ‌ని తెలిపారు. ముందు జాగ్ర‌త్త‌గా టీపీబివో, వెట‌ర్న‌రీ అసిస్టెంట్ స‌ర్జ‌న్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశామ‌న్నారు జ‌నార్ద‌న్ రెడ్డి.

Also Read : న‌మ్మిన వాళ్లే న‌ట్టేట ముంచారు

Leave A Reply

Your Email Id will not be published!