KTR BJP TSPSC : బీజేపీ నిర్వాకం పేపర్ లీకు వ్యవహారం
ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్
KTR BJP TSPSC : ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వ వైఫల్యం కాదని ఇది కేవలం భారతీయ జనతా పార్టీ పన్నిన కుట్ర అంటూ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు.
రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ వల్లనే ఇదంతా జరిగిందని చెప్పారు. కొందరు , కొన్ని పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఆందోళనలు చేపట్టారని ఆరోపించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(KTR BJP TSPSC) లో ఎలాంటి అక్రమాలు చోటు చోసుకలేదన్నారు. యూపీఎస్ సీ చైర్మన్ కూడా ప్రశంసించారని గుర్తు చేశారు.
దేశంలోని 13 రాష్ట్రాల కమిషన్ చైర్మన్లు, సభ్యులు టీఎస్ పీఎస్సీ పనితీరును పరిశీలించారని స్పష్టం చేశారు. గత 8 సంవత్సరాలలో అత్యధికంగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన ఘనత సంస్థకే దక్కిందన్నారు. గతంలో ఏపీపీఎస్సీ లో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు 37 వేల జాబ్స్ భర్తీ చేశామని చెప్పారు.
ఇప్పటి వరకు 150 నోటిఫికేషన్లు ఇచ్చామని , ఏక కాలంలో 10 లక్షల మందికి ఏక కాలంలో పరీక్ష కూడా చేపట్టామన్నారు. రాష్ట్ర యువతకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. వీళ్లిద్దరూ మాత్రమే కాదు వీళ్ల వెనుక ఎవరు ఉన్నా వారిని గుర్తించి శిక్షిస్తామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.
ఇది సంస్థ వైఫల్యం కాదు ఇద్దరు వ్యక్తుల చేసిన తప్పు అని పేర్కొన్నారు. తాము కూడా బాధ పడుతున్నామని చెప్పారు. పేపర్ లీకేజీతో పరీక్షలు రద్దు అయ్యాయని, గతంలో అప్లై చేసుకున్న వారు తిరిగి ఫీజు కట్టాల్సిన అవసరం లేదన్నారు. కోచింగ్ మెటీరియల్ ను ఆన్ లైన్ లో ఉంచుతామన్నారు. సీఎంతో సమగ్రంగా చర్చించామని తెలిపారు కేటీఆర్(KTR).
Also Read : టీఎస్‌పీఎస్సీపై సీఎం సమీక్ష