TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణా ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ ?

ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణా ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ ?

TSRTC: సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తెలంగాణా ఆర్టీసీ(TSRTC) ఆధ్వర్యంలో నడుస్తున్న లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సుల్లో బెర్తులపై 10 శాతం రాయితీని ప్రకటించింది. ఈ సర్వీసులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుందని టిఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తన సోషల్ మీడియా ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. ఈ డిస్కౌంట్ ఏప్రిల్‌ 30 వరకు అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు.

TSRTC Good News

లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబాద్‌ నుంచి చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు రూట్లలో నడుస్తుండగా… లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌కు, గోదావరిఖని – బెంగళూరు, కరీంనగర్ – బెంగళూరు, నిజామాబాద్ – తిరుపతి, నిజామాబాద్ – బెంగళూరు, వరంగల్ – బెంగళూరు రూట్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణాతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు కూడా ఈ రాయితీ ద్వారా లాభం చేకూరనుంది. ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ మరో అడుగు ముందుకేసి ఏసీ బస్సుల్లో పది శాతం రాయితీ అందులోనూ వేసవి కాలంలో ప్రకటించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.

Also Read : YS Sharmila: జగన్‌ ‘విశాఖ విజన్‌’ ప్రకటనపై వైఎస్ షర్మిల సెటైర్లు ?

Leave A Reply

Your Email Id will not be published!