TSRTC Merged : ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
TSRTC Merged : తెలంగాణ సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. సోమవారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలకు తీసుకుంది. మంత్రివర్గం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) వెల్లడించారు. ఆర్టీసీ సంస్థలో పని చేస్తున్న అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు.
TSRTC Merged To Govt
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు వెల్లడించారు. టీఎస్ఆర్టీసీ యాజమాన్యం, మంత్రి, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ల విన్నపం మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అంతే కాకుండా ఇద్దరికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఛాన్స్ ఇచ్చినట్లు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు గాను తక్షణమే రూ. 500 కోట్లు మంజూరు చేయాలని సీఎం ఆర్థిక శాఖను ఆదేశించిందన్నారు కేటీఆర్.
రాష్ట్రంలో కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేసిందన్నారు. వ్యవసాయ రంగానికి ప్రయారిటీ ఇవ్వాలని ఆదేశించారు సీఎం. వరద ఉధృతిలో ప్రాణాలు కోల్పోయిన వారు, గల్లంతయిన వారికి ప్రభుత్వ పరంగా ఎక్స్ గ్రేషియా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇంకా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
Also Read : CJI Chandrachud Manipur Comment : ఈ ప్రశ్నలకు బదులేది..?