TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం
TTD : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత తెలంగాణా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు కూడా శ్రీవారి దర్శనం కల్పించాలని కోరడం జరిగింది. దీనికి ఏపీ ప్రభుత్వం, టీటీడీ(TTD) అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారంలో రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనం, రెండు రోజులు 300 రూపాయల టిక్కెట్టు ద్వారా దర్శనం ఇచ్చేందకు అనుమతి ఇచ్చారు. అయితే ప్రభుత్వం అంగీకరించినప్పటి క్షేత్ర స్థాయిలో తమ సిఫార్సు లేఖలు ఆమోదించడం లేదంటూ ఇటీవల పలువురు తెలంగాణా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా కొండా సురేఖ, రఘునందనరావు బహిరంగంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
TTD Approves..
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ అంగీకరించింది. ఇందులో భాగంగా అధికారిక ప్రకటనను సోమవారం విడుదల చేసింది. ఆ ప్రకటన మేరకు… తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించే విధానం మార్చి 24 నుండి అమల్లోకి రానుంది. వీఐపీ బ్రేక్,రూ.300 దర్శనాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. సోమవారం,మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనం, బుధవారం, గురువారం రూ.300 ప్రత్యేక దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖకు మాత్రమే అనుమతి కల్పిస్తుండగా… సిఫార్సు లేఖపై టీటీడీ ఆరుగురికి శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు.
Also Read : Telangana Assembly: ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం