TTD : భక్తులకు షాక్ సుప్రభాత సేవ రద్దు
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. ఏకంగా నెల రోజుల పాటు భక్తులకు అందుబాటులో ఉన్న సుప్రభాత సేవను రద్దు చేసినట్లు వెల్లడించింది. శుక్రవారం సాయంత్రం నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. దీని కారణంగా శనివారం అర్ధరాత్రి నుంచి సుప్రభాత సేవ సౌకర్యం ఇక ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.
ధనుర్మాసం కారణంగా దీనిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ సుప్రభాత సేవ వచ్చే ఏడాది 2023 జనవరి 14 వరకు కొనసాగుతుందని పేర్కొంది టీటీడీ. తిరుమలలో కొలువైన స్వామి వారికి సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై పఠనం చేస్తారు. స్వామి దర్శనానికి సంబంధించి సుప్రభాత సేవకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కలిగిన స్వామి వారిని సుప్రభాత సేవతోనే మేల్కొల్పటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సేవలో స్వామి వారిని దర్శించుకుని పావనం కావాలని భక్తులు కోరుకుంటారు. ఇందు కోసం నానా తంటాలు పడతారు. అంతే కాదు మంత్రులు, దాతలను వేడుకుంటారు.
దేశానికి చెందిన ప్రముఖులంతా సుప్రభాత సేవలో సేద దీరాలని నానా ప్రయత్నాలు చేస్తారు. దీనికి ఎక్కువ ప్రయారిటీ ఉంటూ వస్తోంది. ఇక ఈ నెల రోజుల పాటు శ్రీ వేంకటేశ్వరుడికి ఈ సేవ ఉండదు. దీంతో భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ(TTD) స్పష్టం చేసింది.
ఇక నుంచి నెల రోజుల పాటు సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై సేవ కొనసాగుతుంది. ఇదిలా ఉండగా ఆన్ లైన్ లో తాము స్వామి వారి ప్రసాదాన్ని విక్రయించడం లేదని వెల్లడించింది.
Also Read : సిరివెన్నెల పాటలతో ఉపశమనం