TTD Chaganti : టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి
ప్రకటించిన టీటీడీ చైర్మన్ వైవీఎస్
TTD Chaganti : ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర్ రావుకు అరుదైన గౌరవం లభించింది. ఈ మేరకు ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సలహాదారుగా నియమించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటంచారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
గత మూడు సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం వరుసగా పారాయణం కార్యక్రమాలు చేపడుతూ వచ్చిందని చెప్పారు. తెలుగు సమాజానికి ప్రధానంగా సంస్కృతి, నాగరికత పట్ల మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్.
తెలుగు వారందరికీ చాగంటి కోటేశ్వర్ రావు ఇష్టమైన వ్యక్తిగా మారి పోయారని పేర్కొన్నారు. ఆయన ప్రవచనాల కోసం లక్షలాది మంది నిత్యం వేచి చూస్తున్నారని ప్రశంసలు కురిపించారు.
టీటీడీ ఇదే క్రమంలో భక్తిని, ధర్మాన్ని, హిందూ సంస్కృతిని పరిరక్షించేందుకు ప్రయత్నం చేస్తూ వస్తోందన్నారు. ఇందులో భాగంగానే చాగంటి కోటేశ్వర్ రావుకు అరుదైన గౌరవం కల్పించాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి.
ఇదిలా ఉండగా తిరుపతి లోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ , శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ కీలక సమావేశానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
హిందూ ధర్మ ప్రచారాన్ని ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో చాగంటి కోటేశ్వర్ రావుకు (TTD Chaganti) అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామీణ యువతను ఇందులో భాగం పంచుకునేలా చేస్తామన్నారు. మానవాళి శ్రేయస్సు కోసం యాగాలు, హోమాలు చేపడతామని చెప్పారు.
Also Read : డ్రోన్ కెమెరాల కదలికలపై విచారణ