TTD Chairman : ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
TTD Chairman : తిరుమల – టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(TTD Chairman). 11 జీవో ప్రకారం ఎంత మందికి ఛాన్స్ ఉంటే వారందరినీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు.
TTD Chairman Comment about TTD Employees
తన అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అలిపిరి గోశాల శ్రీనివాస హోమం ఈనెల 23 నుంచి ప్రారంభం కానుందని తెలిపారు.
టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలం కేటాయించే ప్రాంతాలలో రూ. 27.65 లక్షలతో గ్రావెల్ రోడ్డు నిర్మిస్తామన్నారు టీటీడీ చైర్మన్. రూ. 15 కోట్లతో అదనపు రోడ్డు నిర్మాణం చేపడతామని వెల్లడించారు. తిరుపతి రాం నగర్ క్యాట్రస్ లో అభివృద్ది పనులకు రూ. 6.15 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు.
టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా శాశ్వత ఉద్యోగులకు రూ. 14 వేలు, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కు రూ. 6,850 ఇస్తామన్నారు. తిరుమల ఆరోగ్య విభాగంలో పని చేస్తున్న 650 మంది జాబర్స్ ను కొనసాగిస్తున్నట్లు తెలిపారు టీటీడీ చైర్మన్.
స్విమ్స్ ఆస్పత్రి భవనాన్ని ఆధునీకరణకు రూ. 197 కోట్లు కేటాయించామన్నారు. డీఎఫ్ఓ ఆధ్వర్యంలో రూ. 3.50 లక్షలతో కెమెరాలు, డ్రోన్లు కొనుగోలు చేస్తామన్నారు. కరీంనగర్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపామన్నారు.
Also Read : Hijab Ban : కన్నడ నాట హిజాబ్ నిషేధం