TTD Chairman: అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం – టీటీడీ ఛైర్మన్‌

అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం - టీటీడీ ఛైర్మన్‌

TTD Chairman : దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధంగా ఉందని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్ నాయుడు స్పష్టం చేసారు. అయితే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు… శ్రీవారి ఆలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలంటూ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారు.

TTD Chairman Comment

‘‘దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు… సమాజ అభివృద్ధికి దోహదపడతాయి. దేశాభివృద్ధిలో టెంపుల్‌ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. ఆధ్యాత్మికత వైపు అందరూ అడుగులు వేస్తున్నారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయం ఉండాలి. కోట్లాది మంది భక్తులు దేవాలయాలకు విరాళాలు ఇస్తున్నారు. వాటిని విద్య, వైద్యం సహా ఇతర సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నాం. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు దేవాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి’’ అని ఛైర్మన్‌ నాయుడు లేఖలో పేర్కొన్నారు.

Also Read : MLC Winners: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల విజయం

Leave A Reply

Your Email Id will not be published!