TTD EO : శ్రీవారి దర్శనం సీనియర్ సిటిజన్లకు వరం
ఇక రెండు స్లాట్ లలో స్వామి దర్శనం
TTD EO : కోట్లాది మంది భక్తులను కలిగిన ఆ దేవదేవుడు , కలియుగ నాథుడు శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం ఇక మరింత సులువు కానుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ ఉన్నప్పటికీ గత కొంత కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సీనియర్ సిటిజన్లు (వయో వృద్దులు).
వారి ఇక్కట్లు వర్ణనాతీతం. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తించింది టీటీడీ పాలక మండలి. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వ దర్శనం చేయించేలా ప్లాన్ చేశారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఆయన చేసిన కృషి మేరకు శుభవార్త చెప్పింది టీటీడీ(TTD).
ఇందులో భాగంగా ఇక నుంచి తిరుమల లోని శ్రీ వారిని ఉచితంగా దర్శించుకునే భాగ్యాన్ని సీనియర్ సిటిజన్లకు ప్రసాదించింది. ఇందు కోసం రెండు స్లాట్లు ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటలకు తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వీరు దర్శనం చేసుకునేలా నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. కాగా సీనియర్ సిటిజన్లు తమ ఫోటో కలిగి ఉన్న గుర్తింపు కార్డును, వయస్సు రుజువును తెలియ చేస్తూ తిరుమలలో ఎస్ -1 కౌంటర్ లో దరఖాస్తు సమర్పించాలని స్పష్టం చేసింది.
ఎవరి సిఫారసు అక్కర్లేదని తెలిపింది. సీనియర్లకు వేడి సాంబార్ అన్నం, పెరుగు అన్నం, వేడి పాలు ఉచితంగా ఇస్తామని పేర్కొంది. రూ. 20 చెల్లిస్తే లడ్డూ అందజేస్తామని ఎక్కువ కావాలంటే కొంత చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు ధర్మారెడ్డి(TTD EO) .
ఇదిలా ఉండగా శ్రీవారి దర్శన భాగ్యం సీనియర్ సిటిజన్లకు సులువుగా దక్కనుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఇళ్లను కూల్చేస్తే సర్కార్ కూలుతుంది