TTD EO Dharma Reddy : వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఈ ఏడాది రెండు సార్లు నిర్వహణ
TTD EO Dharma Reddy : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా స్వామి వారికి సంబంధించి ఒక్క సారి మాత్రమే బ్రహ్మోత్సవాలు నిర్వహించేది. కానీ ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి.
TTD EO Dharma Reddy Said
తొలి విడత శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 18 నుండి 26 వరకు , రెండో విడత నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుండి 23 వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పురటాసి మాసం సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 17 వరకు ఉంటుందన్నారు. అధిక మాసం కారణంగా రాబోయే నెలల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు ధర్మారెడ్డి.
ఏర్పాట్లపై ఈవో సమీక్ష చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను 45 రోజుల ముందే ప్రారంభించినట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 18న ధ్వజారోహణం ఉంటుందన్నారు. ఆ రోజు సీఎం జగన్ రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. 22న గరుడ సేవ, 23న స్వర్ణ రథం, 25న రథోత్సవం, 26న చక్ర స్నానం, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని స్పష్టం చేశారు టీటీడీ ఈవో.
ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15న ప్రారంభం అవుతాయని చెప్పారు. 19న గరుడ వాహనం, 22న స్వర్ణ రథం , 23న చక్ర స్నానం ఉంటుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు ధర్మా రెడ్డి.
Also Read : TSRTC Merged : ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం