TTD EO Dharma Reddy : ప‌ద్మావ‌తి బ్ర‌హ్మోత్స‌వాలకు ఏర్పాట్లు

టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి

TTD EO Dharma Reddy : తిరుప‌తి – తిరుచానూరు పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్స‌వాల‌ను వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్ట‌నున్న‌ట్టు టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి స్ప‌ష్టం చేశారు. టీటీడీ(TTD) పరిపాలన భవనంలో కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు.

TTD EO Dharma Reddy Review Meeting Updates

తిరుప‌తి జిల్లా యంత్రాంగం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

నవంబర్ 14న గ‌జ వాహనం, 18న పంచమి తీర్థానికి విశేషంగా భక్తులు వ‌చ్చే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌, బారీకేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు . పంచమితీర్థం నాడు శ్రీవారి పడి ఊరేగింపు అలిపిరి పాదాల మండపం నుంచి మొదలవుతుందని, కోమలమ్మ స‌త్రం, పసుపు మండపం మీదుగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందని తెలిపారు.

దారి పొడవునా గజరాజులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని, తిరుపతి కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని ఈ మార్గాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పుష్క‌రిణి స్నానం కోసం వ‌చ్చే భ‌క్తులు వేచి ఉండేందుకు నవజీవన్ కంటి ఆసుపత్రి, జిల్లా పరిషత్ హైస్కూల్, పూడి రోడ్డు వ‌ద్ద జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలని, ఇక్కడ భక్తుల కోసం క్యూలైన్లు, తాగునీరు, అన్నప్రసాదాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు.

Also Read : AP High Court : చంద్ర‌బాబుకు హైకోర్టు కండీష‌న్స్

Leave A Reply

Your Email Id will not be published!