TTD Facial Recognition : తిరుమలలో సరికొత్త ప్రయోగం
ఫేషియల్ రికగ్నిషన్ ప్రారంభం
TTD Facial Recognition : కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతోంది తిరుమల. ప్రపంచ వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వరుడికి భక్తులు ఉన్నారు. నిత్యం వేలాది మంది స్వామి వారిని దర్శించుకుంటారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లలో నిమగ్నమైంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రధానంగా దర్శనం అన్నది తలకు మించిన భారంగా మారింది.
ఓ వైపు వీఐపీలు, వీవీఐపీలు, సెలెబ్రిటీలు, మధ్యలో శ్రీవాణి టికెట్ దారులు, సిఫార్సు లేఖలు తీసుకు వచ్చే వారితో నిత్యం రద్దీగా మారి పోయింది తిరుమల. ఒక్కోసారి దర్శనం ఇబ్బందికరంగా మారుతోంది. కోట్లాది ఆదాయం ఉన్నా దర్శనం విషయంలో ఇంకా ఇక్కట్లు తప్పడం లేదు. టీటీడీ ఏర్పాట్లపై కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
తాజాగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. బుధవారం నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ను(TTD Facial Recognition) ప్రారంభించింది. శ్రీవారి దర్శనం, గదుల కేటాయింపు, లడ్డూ ప్రసాదం , తదితర అంశాలలో పూర్తి పారదర్శకత ఉండేలా చేస్తోంది. ముఖ గుర్తింపునకు ప్రయారిటీ ఇచ్చింది. కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద కూడా ఫేస్ రికగ్నిషన్ అమలు చేనుంంది. దీని వల్ల అసలైన భక్తులు ఎవరో తేలుతుందని భావిస్తోంది టీటీడీ.
అంతే కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2లో టోకెన్లు లేకుండా వచ్చే వారికి లడ్డూలు ఇవ్వనున్నారు. ఒకేసారి ఎక్కువ గదులు పొందేందుకు వీలు ఉండదు.
Also Read : సామాన్యులకు షాక్ గ్యాస్ ధరలు ఝలక్