Tula Uma : వేములవాడ – తెలంగాణలో శాసన సభ ఎన్నికలు జరుగుతున్న వేళ కోలుకోలేని షాక్ తగిలింది. ప్రజా నాయకురాలిగా , ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన తుల ఉమ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు టికెట్ ఇచ్చి బీ ఫామ్ ఇవ్వకుండా అవమాన పరిచారని ఆవేదన చెందారు. మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావు తనయుడు వికాస్ రావు కు టికెట్ ఇచ్చారు.
Tula Uma May be join in BRS
దీంతో సీరియస్ అయ్యారు పార్టీపై. బీజేపీ కేవలం అగ్ర వర్ణాలకు, దొపిడీ చేసే వాళ్లకు, పార్టీని మోసం చేసే వాళ్లకు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి పెద్ద పీట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవాళ సంచలన ప్రకటన చేశారు తుల ఉమ(Tula Uma). నిత్యం ప్రజా సేవలో ఉన్నానని, పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేశానని తనను పట్టించు కోలేదన్నారు. విద్యా సాగర్ రావు లాంటి దొర ఏం చేశాడని నిలదీశారు. ఈ మేరకు బీజేపీ స్టేట్ చీఫ్ , కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు.
వెనుకబడిన వర్గాలకు చెందిన తనను అగ్రవర్ణాలకు చెందిన నేతలు మోసం చేశారంటూ ఆరోపించారు తుల ఉమ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తుల ఉమ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
Also Read : IT Raids : ఎన్నికల వేళ ఐటీ దాడులు