Tulja Bhavani Reddy : ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన కూతురు

క‌బ్జా భూమిని తిరిగి ఇచ్చేసిన తుల్జా

Tulja Bhavani Reddy : తెలంగాణ రాష్ట్రంలో క‌బ్జాల ప‌ర్వం య‌ధేశ్చ‌గా కొన‌సాగుతోంది. ఇక అధికార పార్టీకి చెందిన వారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ దాడుల‌కు తెగ బ‌డ‌టం, ఆక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డ‌డం ష‌రా మామూలై పోయింది. తాజాగా భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డికి(Muthireddy Yadagiri Reddy) బిగ్ షాక్ త‌గిలింది. దిమ్మ తిరిగేలా ఆన్స‌ర్ ఇచ్చింది ఎవ‌రో కాదు స్వంత కూతురు తుల్జా భ‌వానీ రెడ్డి. ఆమె త‌న తండ్రి చేస్తున్న మోసాన్ని బ‌ట్ట బ‌య‌లు చేసింది.

జ‌న‌గామ ప‌రిధిలోని చేర్యాల లో ఉన్న భూమిని ఎమ్మెల్యే అక్ర‌మంగా ఆక్ర‌మించు కున్నాడంటూ ఆరోపించింది. స్వ‌యంగా త‌నే ఫిర్యాదు చేసింది. తండ్రితో వాగ్వావాదానికి దిగింది. చేర్యాల భూమిలో ప‌శువుల అంగ‌డి ఉంది. ఇందుకు సంబంధించి ఆమెనే స్వ‌యంగా రంగంలోకి దిగింది. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల్సిన నువ్వు ఇలాంటి ప‌నులు ఎలా చేస్తావంటూ జ‌నం ముందే నిల‌దీసింది. ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది.

దీనికి నీళ్లు న‌మిలారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి. క‌బ్జా చేయ‌డ‌మే కాకుండా అడ్డంగా గోడ కూడా క‌ట్ట‌డం చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. దీనిని ఇవాళ త‌న కూతురే స్వ‌యంగా గోడ‌ను కూల్చి వేయించింది. త‌న తండ్రి స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగి ఇచ్చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది తుల్జా భ‌వానీ రెడ్డి. తండ్రి చేసిన త‌ప్పును స‌రి చేసింది. ఈ సంద‌ర్బంగా ఆమెకు జ‌నం హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Also Read : Congress Slams : మోదీ ప్ర‌భుత్వం అన్నింటా వైఫ‌ల్యం

 

Leave A Reply

Your Email Id will not be published!