TVK Party Chief: పార్టీ నేతలకు విజయ్ కీలక ఆదేశాలు
పార్టీ నేతలకు విజయ్ కీలక ఆదేశాలు
TVK Party Chief : తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్(Vijay)… ఆ పార్టీ ముఖ్య నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసారు. పార్టీ పరంగా కమిటీలు, పదవుల భర్తీ ప్రక్రియలన్నీ ఈ నెలాఖరులోపు ముగించాలని విజయ్ ఆదేశించారు. అలాగే పార్టీ కార్యక్రమాలను జూన్ నుంచి విస్తృతం చేయాలని సూచించారు. పార్టీ ఏర్పాటుతో జిల్లాల కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలను విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో ముఖ్య పదవులన్నీ దాదాపుగా భర్తీ అయ్యాయి. ఇతర కమిటీలలో కొన్ని పదవుల భర్తీ కసరత్తులు జరుగుతున్నాయి. ఎన్నికలకు మరికొన్ని నెలలు ఉన్న దృష్ట్యా, ఇక ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణలో విజయ్ ఉన్నారు.
ప్రస్తుతం విజయ్ నటిస్తున్న జననాయగన్ చిత్ర షూటింగ్ ఈనెలతో ముగియనున్నట్టు తెలిసింది. ఆ తర్వాత జూన్ మొదటి వారం నుంచి విజయ్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ఉండబోతున్నారు. ఇందులో భాగంగా విజయ్ పర్యటనలకు సంబంధించి గత రెండు రోజులుగా చెన్నైలో జిల్లాల కార్యదర్శుల సమావేశం విస్తృతంగా సాగుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ పర్యవేక్షణలో ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ పరంగా అన్ని ప్రక్రియలను, పదవుల భర్తీని ఈ నెలాఖరులోపు ముగించాలని విజయ్(Vijay) ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. జూన్ నుంచి ఆయన పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండబోతున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ సైతం సిద్ధమవుతోంది.
TVK Party Chief – విజయ్ Y కేటగిరీ భద్రతపై రాజకీయ దుమారం
కోలీవుడ్ అగ్రనటుడు, టీవికే పార్టీ అధినేత విజయ్(TVK Party Chief) కు కేంద్రం ‘వై’ కేటగిరీ భద్రతను కేటాయించింది. రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా మారడం, పైగా తరచూ జనాల్లోకి వెళ్తుండడంతో ఆయన ప్రాణాలకు ముప్పు కలగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంతోనే హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో.. ఒకరు లేదా ఇద్దరు కమాండోలతో పాటు 8-11 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది విజయ్‌కు భద్రతగా ఉండనున్నారు.
అయితే ఈ వ్యవహారం తమిళనాట రాజకీయ విమర్శలకు దారి తీసింది. విజయ్ కు రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి భద్రత ఎందుకు కల్పించలేకపోయిందని బీజేపీ ప్రశ్నలు సంధించింది. ‘‘విజయ్ తమిళనాట ప్రజాదరణ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి భద్రతకు ముప్పు పొంచి ఉందనే సమాచారం ఉన్నప్పుడు.. ఇక్కడి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. డీఎంకే ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించేందుకు ముందుకు రావొచ్చు కదా?’’ అని తమిళనాడు బీజేపీ అగ్రనేత అన్నామలై ప్రశ్నించారు. దీనిపై డీఎంకే నుంచి బదులు రావాల్సి ఉంది.
మరోవైపు.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో విజయ్ను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ ఆడుతున్న డ్రామా ఇదని అన్నాడీఎంకే ఆరోపిస్తోంది. నిజాయితీగా విజయ్ కు కేంద్రం భద్రతను ఇచ్చి ఉంటే ఫర్వాలేదు. కానీ, రాజకీయం కోసం చేసి ఉంటే మాత్రం.. తమిళనాడులో అలాంటి పాచికలు పారవు’’ అని అన్నాడీఎంకే నేత మునుస్వామి చురకలటించారు.
Also Read : Seven MPs: పాక్ తో భారత్ దౌత్య యుద్ధం ! ఏడుగురు ఎంపీలతో విదేశాలకు బ్రీఫింగ్ !