Twitter Changes : ట్విట్టర్ కీలక మార్పు
జమ్మూ కాశ్మీర్ భారత్
Twitter Changes : సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కీలక మార్పు చేసింది. ట్విట్టర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని వినియోగదారుల లొకేషన్ ను భారత దేశంలోని జమ్మూ కాశ్మీర్ గా మార్చేసింది(Twitter Changes). ఇది సంచలనం కలిగిస్తోంది. గిల్లిత్ -బాల్డిస్తాన్ నుండి వచ్చిన ట్వీట్లు ఇప్పుడు భారత దేశం నుండి ఉద్భవించాయని పాకిస్తాన్ మీడియా గగ్గోలు పెడుతున్నాయి. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా బ్లాక్ చేయడం విశేషం.
దీనిపై తాము ట్విట్టర్ యాజమాన్యానికి ఫిర్యాదు కూడా చేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా ట్విట్టర్ కు ఇటీవలే బిగ్ షాక్ తగిలింది. బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. అంతే కాదు ఏ సంస్థ అయినా సుప్రీం కాదని స్పష్టం చేసింది. ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే భారత దేశపు సమగ్రతను కాపాడేలా ఉండాలని, ఇక్కడి భారత రాజ్యాంగానికి అనుగుణంగా, రూల్స్ కు సపోర్ట్ గా ఉండాల్సిందేనంటూ స్పష్టం చేసింది.
ఇప్పటికే ట్విట్టర్ సిఇఓ దీనికి సంబంధించి పలుమార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరో వైపు టెస్లా చైర్మన్ , సిఇఓ ఎలోన్ మస్క్ దానిని గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు . ఇందులో భాగంగా కీలక మార్పులు చేశారు.
Also Read : Revanth Reddy KCR : కేసీఆర్ వల్లనే బషీర్ బాగ్ లో కాల్పులు