Twitter Logo Change : ట్విట్టర్ లోగో మార్పుపై ఫైర్
ఎలోన్ మస్క్ పై విమర్శలు
Twitter Logo Change : టెస్లా చైర్మన్ , ట్విట్టర్ సిఇఓ ఎలోన్ మస్క్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఆయన ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నాక కీలక మార్పులు చేశాడు. వేలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపాడు. టాప్ పొజిషన్ లలో ఉన్న వారికి కోలుకోలేని షాక్ ఇచ్చాడు.
పని చేయక పోతే తాను ఒప్పుకోనంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆపై ట్విట్టర్ ను సమూలంగా మార్చేస్తానంటూ ప్రకటించి విస్తు పోయేలా చేశాడు. అంతే కాదు కోట్లాది మంది నిత్యం ట్విట్టర్ ను వాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ సోషల్ మీడియాగా ఇప్పటికీ నెంబర్ వన్ లో కొనసాగుతోంది ఈ పిట్ట కూత.
Twitter Logo Change Elon Musk
ఇక నుంచి బ్లూ టిక్ ఉండాలంటే ఫీజు చెల్లించాల్సిందేనంటూ ప్రకటించాడు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. అయినా పట్టించు కోలేదు. ఎలోన్ మస్క్(Elon Musk) మామూలోడు కాదు. ఆయన ప్రపంచంలో మోస్ట్ బిలియనీర్లలో ఒకడు. ఇంకేం త్వరలో సంచలన ప్రకటన చేస్తానంటూ వెల్లడించారు. ఉన్నట్టుండి జూలై 24న ట్విట్టర్ లోగోను మారుస్తున్నట్లు ప్రకటించాడు.
ఇప్పటి వరకు ట్విట్టర్ అంటే పిట్ట లోగో ఉండేది. దాని స్థానంలో ఎక్స్ ను జోడించాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్స్ అంటే సెక్స్ సైట్స్ కు ఎక్కువగా వాడుతారంటూ పేర్కొంటున్నారు నెటిజన్లు. ఎలోన్ మస్కా మజాకా కదూ.
Also Read : VRAs CM KCR : సారూ మీ సాయం మరువం