TSPSC Paper Leak : పేపర్ లీకేజీలో మరో ఇద్దరు అరెస్ట్
అదుపులోకి తీసుకున్న సిట్
TSPSC Paper Leak : తెలంగాణలో చోటు చేసుకున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీకేజీ(TSPSC Paper Leak) వ్యవహారంలో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. వీరిని ప్రత్యేక దర్యాప్తు బృందం అదపులోకి తీసుకుంది. మహబూబ్ నగర్ కు చెందిన మైసయ్య, జనార్దన్ లను అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులైన ప్రవీణ్ , రాజశేఖర్ రెడ్డి, రేణుక , ఆమె భర్త డాక్యా నాయక్ ను ఇప్పటికే అరెస్ట్ చేసింది.
ఇదిలా ఉండగా రేణుక భర్త డాక్యా నాయక్ వద్ద ఏఈ ఎగ్జామ్ పేపర్ ను కొడుకు కోసం మైసయ్య రూ. 2 లక్షల రూపాయలకు కొనుక్కొన్నాడని సిట్ స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి తండ్రీ , కొడుకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పేపర్ లీకేజీకి కేసులో ఇప్పటి వరకు 19 మంది అరెస్ట్ చేసింది సిట్. మొత్తం 450 మందిని విచారించింది సిట్ .
హైకోర్టుకు పేపర్ లీకేజీకి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాల్సి ఉంది. ఓ వైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే మరో వైపు పేపర్ లీకేజీ(TSPSC Paper Leak) వ్యవహారంలో డబ్బులు చేతులు మారాయని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. ఆ వెంటనే రంగంలోకి దిగింది. సిట్ నుంచి తమకు పూర్తి వివరాలు ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రధాన నిందులు ప్రవీణ్ , రాజశేఖర్ లను కస్టడీలోకి తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.
Also Read : ఆంధ్రా విద్యార్థి కాల్చివేత