Prisoners: చోడవరం సబ్‌ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ

చోడవరం సబ్‌ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ

Prisoners: చోడవరం సబ్‌జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారైన ఘటన అనకాపల్లి జిల్లాలో కలకలం రేపింది. జైలులో వంట పని కోసం ఖైదీలను (Prisoners) వినియోగించేందుకు బయటకు తీసుకొచ్చిన క్రమంలో… మాడుగుల చోరీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బెజవాడ రాము హెడ్‌ వార్డర్‌ రాజుపై సుత్తితో దాడి చేశాడు. అనంతరం హెడ్‌వార్డర్‌ వద్ద ఉన్న తాళాల గుత్తి తీసుకుని… ప్రధాన ద్వారం లాక్‌ తీసి పరారయ్యాడు. అతన్ని వెతికేందుకు అని చెప్పి… ఫించను డబ్బు కాజేసిన కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న పంచాయతీ మాజీ కార్యదర్శి నక్కా రవికుమార్‌ పారిపోయాడు. తలకు గాయం కావడంతో హెడ్‌ వార్డర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారైన ఖైదీల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Prisoners – యూట్యూబ్‌ వీడియోలు చూసి చోరీల్లో ఆరితేరిన దొంగ అరెస్ట్‌

యూట్యూబ్‌ వీడియోలు చూస్తూ చాకచక్యంగా చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని గుంటూరు నల్లపాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్‌ మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలానికి చెందిన జంగం బాజీ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతనిపై రౌడీషీట్‌ కూడా ఉంది. చోరీలు ఎలా చేయాలో గత కొంత కాలంగా యూట్యూబ్‌ వీడియోలు చూసి నేర్చుకున్నాడు. కారు అద్దాలను పగులకొట్టి కారులోని వస్తువులను రెప్పపాటులో దొంగిలించడంలో ఆరితేరాడు.

వరుసగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలో చోరీలు జరుగుతుండటంతో పోలీసులు నిఘా పెట్టారు. సీసీ ఫుటేజ్‌, సాంకేతిక ఆధారాలతో దొంగను పట్టుకున్నామని ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. మూడు నెలల వ్యవధిలో కార్ల అద్దాలు పగులగొట్టి 10 దొంగతనాలు చేశాడని.. నిందితుడి వద్ద నుంచి ఆరు ల్యాప్‌టాప్‌లు, రూ.2లక్షల నగదుతో పాటు, 11 గ్రాములు బంగారం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. బాజీపై 9 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

Also Read : Minister Nara Lokesh: ప్రభుత్వ విద్యను రాజకీయాలకు దూరంగా ఉంచాం – మంత్రి లోకేశ్

Leave A Reply

Your Email Id will not be published!