Blast: కోచింగ్ సెంటర్‌లో పేలుడు ! ఇద్దరు మృతి !
కోచింగ్ సెంటర్‌లో పేలుడు ! ఇద్దరు మృతి !
Blast : ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్‌లో శనివారం నాడు మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఖాద్రీ గేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతం సాతాన్‌పూర్ మండి రోడ్ లోని ఒక కోచింగ్ సెంటర్ లో జరిగిన పేలుడులో (Blast) ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి కోచింగ్ సెంటర్ పూర్తిగా నేలమట్టమైంది. ఈ పేలుడు తీవ్రతకు భవనం పైకప్పుతో సహా ఎగిరిపోయాయి. సమీపంలోని ఇళ్ల అద్దాల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి. స్థానికుల సమాచారంతో మూడు అగ్నిమాపక శకటాలు, అంబులెన్స్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను లోహియా జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం…
‘ది సన్ క్లాసెస్ లైబ్రరీ’ కోచింగ్ సెంటర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో పేలుడు (Blast) సంభవించింది. పేలుడులో పలువురు పిల్లలు గాయపడ్డారు. ఐదుగురు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా వారిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. పేలుడు ఘటన తెలిసిన వెంటనే భారీగా పోలీసు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు. పేలుడుకు కారణాలపై విచారణ జరుపుతున్నారు. పేలుడు (Blast) సమాచారంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) తక్షణం స్పందించారు. ఘటనా స్థలికి వెళ్లి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అయితే, పేలుడుకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలను కూడా ప్రమాద స్థలికి చేరుకున్నాయి. పేలుడు గ్యాస్ సిలిండర్ కారణామా? షార్ట్ సర్క్యూటా? లేదా పేలుడు పదార్థం వల్ల ఈ ఘటన జరిగిందా? అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Blast – విదేశీ కోచ్‌లపై వీధి కుక్కల వీరంగం
దేశరాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వచ్చిన కెన్యా, జపాన్ కోచ్‌లపై వీధి కుక్కలు దాడి చేశాయి. కెన్యా కోచ్ డెన్నిస్ మరాగియా మ్యాన్జో కుడి కాలిపై కుక్క కరవడంతో అతనిని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. జపాన్ కోచ్ మెయికో ఓకుమాట్సు కూడా కుక్కల దాడి బారినపడ్డారు. ఈ ఘటన దరిమిలా స్టేడియం భద్రతా దళం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలో వీధికుక్కలను పట్టుకునేందుకు ఢిల్లీ సర్కారు ఉపక్రమించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వచ్చిన కెన్యా కోచ్‌ను స్టేడియం ప్రాంగణంలోకి చొరబడిన వీధి కుక్క కరిచింది. దీనిపై అథ్లెట్లు, సహాయక సిబ్బంది తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. కెన్యా స్ప్రింట్స్ కోచ్ డెన్నిస్ మరాగియా మ్వాన్జో వార్మప్ ట్రాక్‌పై అథ్లెట్లకు శిక్షణ ఇస్తుండగా కుక్క దాడికి గురయ్యారు. స్టార్టింగ్ బ్లాక్స్‌ను సరిచేస్తుండగా, వీధికుక్క అతని వెనుక నుండి వచ్చి ఆయన కుడి కాలిపై కరిచింది. అక్కడే ఉన్న మెడికల్ టీమ్ ఆయనకు ప్రథమ చికిత్స అందించింది. తరువాత మెరుగైన చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. డెన్నిస్ మరాగియాకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.
కెన్యా కోచ్‌పై జరిగిన దాడి తరువాత జపాన్ పారా అథ్లెటిక్స్ అసిస్టెంట్ కోచ్ మెయికో ఓకుమాట్సు పైనా కుక్క దాడి చేసింది. దీంతో ఆమె ఎడమ కాలిపై తీవ్ర గాయమయ్యింది. ఈ ఘటనలన్నీ స్టేడియం ట్రాక్‌లోనే జరిగాయి. ఓ సెక్యూరిటీ గార్డును కూడా వీధికుక్క కరిచినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ ఆర్గనైజింగ్ కమిటీ స్టేడియంలోనికి వీధికుక్కలు రాకుండా చూడాలని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌కు విజ్ఞప్తి చేసింది. స్టేడియం సమీపంలోనివారు ఇక్కడ కుక్కలకు ఆహారం వేయడంతో అవి లోనికి ప్రవేశిస్తున్నాయని కమిటీ తెలిపింది.
Also Read : Home Minister Amit Shah: మావోయిస్టులు లొంగిపోవాల్సిందే – అమిత్ షా
