Uday Shankar : ఉద‌య్ శంక‌ర్ రియ‌ల్ టార్చ్ బేర‌ర్

స్టార్ ను ప‌రుగులు పెట్టిస్తున్న సిఇఓ

Uday Shankar : ఎవ‌రీ ఉద‌య్ శంక‌ర్ అనుకుంటున్నారా. భార‌త దేశంలో మోస్ట్ పాపుల‌ర్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీస‌ర్ (సిఇఓ). ఆర్భాటాలు,

భేష‌జాల‌కు దూరంగా ఉంటూ స్టార్ , డిస్నీ గ్రూప్ ను ప‌రుగులు పెట్టిస్తున్న ఏకైక ఇండియ‌న్ స‌క్సెస్ ఫుల్ నాయ‌కుడు.

ఉద‌య్ శంక‌ర్ సిఇఓనే అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే మోస్ట్ స‌క్సెస్ ఫుల్ బిజినెస్ మెన్. ప్ర‌పంచ దిగ్గ‌జ మీడియా సంస్థ‌ల సిఇఓలలో టాప్ లో ఉన్నాడు ఉద‌య్ శంక‌ర్(Uday Shankar).

ఉద‌య్ శంక‌ర్ వ‌య‌సు 59 ఏళ్లు. ఆయ‌న స్వంతూరు బీహార్ లోని ముజ‌ఫ‌ర్ పూర్. ఆల్మా మేట‌ర్ ప‌టాహి హైస్కూల్ లో చ‌దివాడు. టైమ్స్ స్కూల్ ఆఫ్ జ‌ర్న‌లిజం చ‌దివాడు.

ప్ర‌పంచంలో టాప్ లో ఉన్న ది వాల్ డిస్నీ కంపెనీ ఆసియా ప‌సిఫిక్ కు ఆక్యుపేష‌న్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అంతే కాదు స్టార్ ఇండియా చైర్మ‌న్ గా ఉన్నాడు ఉద‌య్ శంక‌ర్.

అంతే కాదు వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా చైర్మ‌న్ గా కూడా కొన‌సాగుతున్నారు. 1996 నుంచి నేటి దాకా సిఇఓగా, చైర్మ‌న్ గా స‌మ‌ర్థ‌వంతంగా

బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ వ‌ర‌ల్డ్ లో టాప్ లో కొన‌సాగేలా చేస్తున్నాడు ఉద‌య్ శంక‌ర్.

ఫోర్బ్స్ ఇండియాల లీడ‌ర్ షిప్ అవార్డును ప్ర‌క‌టించింది. మాజీ పాత్రికేయుడు కూడా. ఉద‌య్ శంక‌ర్ సెప్టెంబ‌ర్ 16, 1962లో పుట్టాడు. తండ్రి సివిల్ ఇంజ‌నీర్. త‌న కొడుకును సివిల్ స‌ర్వెంట్ గా చూడాల‌ని అనుకున్నాడు.

కానీ ఉద‌య్ శంక‌ర్(Uday Shankar) జ‌ర్న‌లిస్ట్ కావాల‌ని అనుకున్నాడు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ యూనివ‌ర్శిటీలో ఎక‌నామిక్స్ లో

ఎంఏ చేశాడు. సివిల్స్ రాశాడు. ఇంట‌ర్యూలో ఫెయిల్ అయ్యాడు.

ఉద‌య్ శంక‌ర్ రెండోసారి రాశాడు. కానీ రాలేదు. పాట్నాలోని టైమ్స్ ఆఫ్ ఇండియా కు రాజ‌కీయ ప్ర‌తినిధి (పొలిటిక‌ల్ క‌రెస్పాండెంట్ )గా

త‌న వృత్తిని ప్రారంభించాడు.

కొంత కాలం ప‌ని చేశాక తిరిగి ఢిల్లీకి వ‌చ్చాడు. ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ ప‌త్రిక డౌన్ టు ఎర్త్ లో ప‌ని చేశాడు ఉద‌య్ శంక‌ర్. అక్క‌డి నుంచి

సుభాష్ చంద్ర సార‌థ్యంలోని జీ టీవీలో టీవీ న్యూస్ విభాగంలో న్యూస్ ప్రొడ్యూస‌ర్ గా ప‌ని చేశాడు.

జీటీవి నుంచి హోమ్ టీవీ, స‌హారా స‌మ‌య్ , ఆజ్ త‌క్ లో ప‌ని చేశాడు. చివ‌ర‌కు స్టార్ న్యూస్ కి చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీస‌ర్ గా మారాడు.

అంతే కాదు స్టార్ ఇండియా మొత్తం ప్ర‌సార కార్యకాలాపాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు చైర్మ‌న్ గా , సిఇఓగా ప్ర‌మోష‌న్ పొందాడు.

డిసెంబ‌ర్ 5, 2017లో ఉద‌య్ శంక‌ర్ 21వ సెంచ‌రీ ఫాక్స్ ఫ‌ర్ ఆసియా చీఫ్ గా నియ‌మితుల‌య్యారు. ఇది ఆన్ లైన్ వీడియో

ప్లాట్ ఫార‌మ్ వ్యాపారాన్ని ప‌ర్య‌వేక్షిస్తుంది.

13 డిసెంబ‌ర్ 2018న 21వ సెంచ‌రీ ఫాక్స్ కొనుగోలు ముగిసింది. ఉద‌య్ శంక‌ర్ డిస్నీ ఆసియా ఫ‌సిపిక్ ప్రాంతానికి నాయ‌క‌త్వం వ‌హిస్తార‌ని ,

డిస్నీ ఇండియాకు చైర్మ‌న్ గా ఉంటార‌ని వాల్ట్ డిస్నీ కంపెనీ ప్ర‌క‌టించింది.

1 ఏప్రిల్ 2019న ఉద‌య్ శంక‌ర్(Uday Shankar) డిస్నీ ఆసియా ఫ‌సిఫిక్ చీఫ్ గా, స్టార్ ఇండియా, డిస్నీ చైర్మ‌న్ గా ఉన్నారు. 8 అక్టోబ‌ర్ 2020న ప్రెసిడెంట్ ప‌ద‌వి నుండి వైదొలిగాడు. 

ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్ గా ప‌ని చేస్తున్నాడు. మీడియా అండ్ ఎంట‌ర్ టైన్మెంట్ కు చీఫ్ గా ప‌ని చేశాడు.

 

Also Read : అత్యున్న‌త స్థానం నుంచి అధః పాతాళానికి

Leave A Reply

Your Email Id will not be published!