Udhayanidhi Stalin Modi : మోదీతో ఉద‌య‌నిధి స్టాలిన్ భేటీ

కీల‌క అంశాల‌పై చ‌ర్చ

Udhayanidhi Stalin Modi : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీని త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ త‌న‌యుడు, మంత్రి, న‌టుడు ఉద‌య‌నిధి స్టాలిన్ మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు జ్ఞాపిక‌ను కూడా బ‌హూక‌రించారు. త‌మిళ‌నాడు, క్రీడ‌ల‌కు నీట్ మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరారు ప్ర‌ధాని మోదీని.

ఇటీవ‌లే ఉద‌య‌నిధి స్టాలిన్ మంత్రి వ‌ర్గంలో చేరారు. ఆయ‌న రాష్ట్ర యువ‌జ‌న సంక్షేమం, క్రీడల అభివృద్ది శాఖ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఢిల్లీలో పీఎం నివాసంలో మోదీని క‌లిశారు ఉద‌య‌నిధి స్టాలిన్(Udhayanidhi Stalin Modi).

ఇందులో భాగంగా నేష‌న‌ల్ ఎలిజిబిటీ క‌మ్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (నీట్ ) నుంచి త‌మిళ‌నాడుకు మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరారు. ఈ ప‌రీక్ష ఫెడ‌రిలిజం సూత్రాల‌కు విరుద్ద‌మ‌ని గ్రామీణ‌, రాష్ట్ర బోర్డు విద్యార్థుల‌ను న‌ష్టాల్లోకి నెట్టి వేసింద‌ని ఈ సంద‌ర్భంగా పీఎంకు వివ‌రించారు ఉద‌య‌నిధి స్టాలిన్. ఇదే విష‌యంపై ద్ర‌విడ మున్నేట్ర క‌జ‌గం (డీఎంకే) ప్ర‌భుత్వం ఇటీవ‌ల సుప్రీంకోర్టులో కూడా పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యాన్ని ప్ర‌ధాన‌మంత్రికి తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో జ‌రిగిన సంభాష‌ణ చాలా ఆస‌క్తిక‌రంగా, ఆహ్లాద‌క‌రంగా సాగింద‌న్నారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌ధాన మంత్రి మోదీ త‌ల్లి కోకిలా బెన్ మ‌ర‌ణించారు. నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ చేశాన‌ని తెలిపారు. సీఎంకు కూడా న‌మ‌స్కారాలు తెలియ చేశార‌ని పేర్కొన్నారు. క్రీడ‌ల్లో చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల గురించి అడిగి తెలుసుకున్నార‌ని వెల్ల‌డించారు ఉద‌య‌నిధి స్టాలిన్(Udhayanidhi Stalin). 

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో మినీ స్టేడియం నిర్మించాల‌ని త‌మ ప్ర‌భుత్వ ప్రణాళిక అని తెలిపారు. చెన్నైలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయి) కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరిన‌ట్లు పేర్కొన్నారు. తిరువ‌ళ్లువ‌ర్ విగ్ర‌హాన్ని మోదీకి అంద‌జేశారు స్టాలిన్.

Also Read : క‌న్న‌డ నాట మోదీనే ప్ర‌చార అస్త్రం

Leave A Reply

Your Email Id will not be published!