Udhayanidhi Stalin : ఈపీఎస్..ఓపీఎస్ లాగా జీవించొద్దు – స్టాలిన్
అన్నాడీఎంకే నేతలపై సెటైర్
Udhayanidhi Stalin : తమిళనాడు యువ నాయకుడు, రాష్ట్ర కేబినెట్ మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) సెటైర్ వేశారు. ఆయన అన్నాడీఎంకే మాజీ సీఎం , మాజీ డిప్యూటీ సీఎం ఎడాపాడి పళని స్వామి, పన్నీర్ సెల్వం (ఈపీఎస్, ఓపీఎస్ )లను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారిని ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో ఆసక్తికర మైన కామెంట్స్ చేశారు. మీరు ఈపీఎస్, ఓపీఎస్ లాగా జీవించకండి అంటూ సూచించారు. అన్నామలైని కలిసేందుకు ఈపీఎస్, ఓపీఎస్ వేర్వేరుగా వెళ్లడాన్ని ఎద్దేవా చేశారు. తమకంటూ ఓ సిద్దాంతం లేని వాళ్లే ఇలా చేస్తారంటూ మండిపడ్డారు ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin).
అంతకు ముందు మంత్రి కళ్యాణ మండపం ప్రారంభోత్స వ కార్యక్రమానికి హాజరయ్యారు. సాధారణంగా ప్రజలు కొత్త జంటలకు ఎలా జీవించాలో సలహా ఇస్తారని కానీ ఈపీఎస్, ఓపీఎస్ లాగా మాత్రం తయారు కావద్దంటూ పేర్కొన్నారు ఉదయనిధి స్టాలిన్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తగా పెళ్లయిన వారు ఎలా జీవించ కూడదో మీకు ఒక ఉదాహరణ చెబుతాను.
నేను రాజకీయాలు మాట్లాడకుండా ఉండలేనని అన్నారు. తమిళనాడులో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు ఉదయనిధి స్టాలిన్. మీరు పళని స్వామి, పన్నీర్ సెల్వం లాగా ఆత్మ గౌరవాన్ని మాత్రం కోల్పోకండి అంటూ పిలుపునిచ్చారు. మీకు కావాల్సిన వాటిని డిమాండ్ చేసి సాధించు కోవాలే తప్పా తలవంచ కూడదన్నారు. ఇదిలా ఉండగా ఉదయనిధి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ రెడ్డిపై వేటు