UGC Releases : దేశంలో 21 నకిలీ యూనివర్శిటీలు
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ వెల్లడి
UGC Releases : యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ సంచలన ప్రకటన(UGC Releases) చేసింది. ఈ మేరకు దేశంలో గుర్తింపు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తూ , ఫేక్ సర్టిఫికెట్లను జారీ చేస్తున్న యూనివర్శిటీలను గుర్తించింది.
ఈ మేరకు అధికారికంగా 21 ఫేక్ విశ్వ విద్యాలయాలు ఉన్నట్లు ప్రకటించింది. విద్యార్థులు, పేరెంట్స్ వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఆయా సంస్థల పేర్లను కూడా వెల్లడించింది.
ఈ నకిలీ యూనివర్శిటీలలో అత్యధికంగా ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలోనే ఉండడం విశేషం. వీటికి ఎటువంటి డిగ్రీలను ప్రధానం చేసే హక్కు లేదని యూజీసీ స్పష్టం చేసింది.
వీటిలో ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ , కమర్షియల్ యూనివర్శిటీ లిమిటెడ్ , యునైటెడ్ నేషన్స్ యూనివర్శిటీ, వొకేషనల్ యూనివర్శిటీ, ఏడీఆర్ – సెంట్రిక్ జ్యూరిడికల్ యూనివర్శిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉన్నాయి.
వీటితో పాటు విశ్వకర్మ ఓపెన్ యూనివర్శిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం నకిలీ యూనివర్శిటీలంటూ యూజీసీ ప్రకటించింది.
ఉత్తర ప్రదేశ్ లో నాలుగు (4) యూనివర్శిటీలు, పశ్చిమ బెంగాల్ , ఒడిశా రాష్ట్రాలలో రెండు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒక్కో ఫేక్ యూనివర్శిటీలు ఉన్నాయని వెల్లడించింది.
కాగా యూనివర్శిటీ గ్రాంట్స్ చట్టం 1995 , సెక్షన్ 22 ప్రకారం డిగ్రీలు ప్రదానం చేసే లేదా మంజూరు చేసే హక్కును కేవలం గుర్తింపు పొందిన యూనివర్శిటీలకు మాత్రమే ఉంటుంది.
నకిలీ యూనివర్శిటీల పేరుతో విద్యార్థులను మోసం చేసే ఇలాంటి ఫేక్ సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Also Read : న్యాయ వ్యవస్థ అత్యంత కీలకం