Ujjwal Nikam: ‘లోక్‌సభ’ బరిలో ముంబై బాంబు పేలుళ్ళు కేసు లాయర్ ఉజ్వల్‌ నికమ్‌ !

‘లోక్‌సభ’ బరిలో ముంబై బాంబు పేలుళ్ళు కేసు లాయర్ ఉజ్వల్‌ నికమ్‌ !

Ujjwal Nikam: లోక్‌ సభ ఎన్నికలకు గానూ మహారాష్ట్రలో మరో అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ముంబయి నార్త్‌ సెంట్రల్‌ స్థానంలో వరుసగా రెండుసార్లు గెలిచిన సిట్టింగ్‌ ఎంపీ పూనమ్‌ మహాజన్‌ ను ఈసారి పక్కనపెట్టి… ప్రముఖ సీనియర్‌ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌ పేరును ప్రకటించింది. పూనమ్‌ తండ్రి ప్రమోద్‌ మహాజన్‌ హత్య కేసును ఆయనే వాదించారు. కాంగ్రెస్‌ ఇప్పటికే ధారావీ ఎమ్మెల్యే వర్ష ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌ను ఇక్కడినుంచి పోటీలో దించింది. అదేవిధంగా.. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన జాబితానూ భాజపా శనివారం విడుదల చేసింది.

Ujjwal Nikam Participates

1993 ముంబయి బాంబు పేలుళ్లు, టి-సిరీస్‌ మ్యూజిక్‌ సంస్థ అధినేత గుల్షన్‌ కుమార్‌ హత్య కేసు, 2008 ముంబయి దాడుల కేసుల్లో నిందితులను కటకటాల్లోకి పంపడానికి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అయిన ఉజ్వల్‌ నికమ్‌ అలుపెరగకుండా శ్రమించారు. 2013 ముంబయి గ్యాంగ్‌ రేప్‌ కేసు, 2016 కోపర్దీ సామూహిక అత్యాచారం, హత్య కేసుల్లో ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ గా పని చేశారు. ఆయన విశేష సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది. 2017లో ఉజ్వల్‌ నికమ్‌ బయోపిక్‌.. ‘ఆదేశ్‌- ది పవర్‌ ఆఫ్‌ లా’ అనే పేరుతో కోర్టు రూమ్‌ డ్రామాగా తెరకెక్కింది. ఇదిలాఉండగా… లోక్‌సభ ఎన్నికల ఐదో విడతలో భాగంగా మే 20న ముంబయి నార్త్‌ సెంట్రల్‌ లో పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Also Read : KTR Slams : రేవంత్ రెడ్డి ఎక్కడ ఇంఛార్జ్ గా ఉంటే అక్కడ కాంగ్రెస్ కి ఓటమే

Leave A Reply

Your Email Id will not be published!