Ukraine Crisis : రష్యా అన్నంత పని చేసింది. దాడులకు పాల్పడడంతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎక్కడికక్కడ జనం బారులు తీరారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు రష్యా దాడులతో 300 మందికి పైగా సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
ఉక్రెయిన్ రాజధాని కార్కివ్ మిస్సైళ్లతో దద్దరిల్లుతోంది. బంకర్లు సైతం నిండి పోయాయి. 50 లక్షల మందికి పైగా జనం నిరాశ్రయులుగా మారారు. ఓ వైపు ఐక్య రాజ్య సమితి, నాటో, అమెరికా సైతం దాడులను వెంటనే విరమించాలని కోరినా ఫలితం లేక పోయింది.
ఆయుధాలను విడవండి అంటూ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ప్రకటించడంతో రెచ్చి పోయారు. రష్యా బోర్డర్ వద్ద వాహనాలు బారులు తీరారు. మొదట్లో తాము యుద్దానికి సిద్దమంటూ ప్రకటించారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్ వోస్కీ.
ఇప్పటి వరకు అమెరికా చీఫ్ బైడన్ హెచ్చరించినా పట్టించు కోలేదు రష్యా. ఎయిర్ పోర్టును స్వాధీనం చేసుకున్నాయి రష్యా దళాలు. ముందస్తు హెచ్చరికలు చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటడం దారుణమని ప్రపంచం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఉక్రెయిన్ లో ఆరు మిస్సైల్స్ ప్రయోగించినట్లు సమాచారం. రష్యా దాడితో ప్రపంచం ఒకింత ఇబ్బందికి గురవుతోంది. ఆర్థిక ఆంక్షలు విధించినా, తనతో స్నేహం వద్దనుకున్నా పట్టంచు కోవడం లేదు పుతిన్.
ఇప్పటికే ఐక్య రాజ్య సమితి అత్యవసర సమావేశం చేపట్టింది. భారత్ తో సహా పలు దేశాలు రష్యాను యుద్ధం విరమించాలని కోరాయి. ఇది ఎంత మాత్రం మంచిది కాదని సూచించింది ఇండియా.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్(Ukraine Crisis )పై రష్యా పూర్తిగా పట్టు సాధించింది. పలు ప్రాంతాల నుంచి జనం బయటకు వచ్చారు. ఎక్కడ చూసినా వాహనాలతో నిండి పోయాయి రోడ్లు.
Also Read : అధ్యక్షుడి భావోద్వేగం ప్రపంచం ఆశ్చర్యం