Uma Harathi IAS: ట్రైనీ ఐఏఎస్‌ గా అకాడమీకు వచ్చిన కుమార్తెకు సెల్యూట్‌ చేసిన ఐపీఎస్‌ తండ్రి !

ట్రైనీ ఐఏఎస్‌ గా అకాడమీకు వచ్చిన కుమార్తెకు సెల్యూట్‌ చేసిన ఐపీఎస్‌ తండ్రి !

Uma Harathi IAS: ఫాదర్స్ డేకు ఒక్క రోజు ముందే తెలంగాణా పోలీస్ అకాడమీలో ఒక అరుదైన, సూపర్తిదాయకమైన సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణాకు చెందిన ఉమా హారతి(Uma Harathi) సివిల్స్-2022 పరీక్షల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి… ప్రస్తుతం తన ఐఏఎస్ శిక్షణలో భాగంగా శనివారం తెలంగాణా పోలీసు అకాడమీకు వచ్చారు. అయితే గతంలో నారాయణపేట జిల్లా ఎస్పీగా పని చేసిన ఆమె తండ్రి వెంకటేశ్వర్లు… ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రైనీ ఐఏఎస్‌గా తెలంగాణ పోలీస్ అకాడమీకి వచ్చిన తన కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంకు అధికారి అయిన వెంకటేశ్వర్లు హృదయం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. గర్వంతో ఆయన తన కుమార్తెకు సెల్యూట్ చేసి… పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారుతున్నాయి. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తూ… కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Uma Harathi IAS…

ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎస్‌లు శిక్షణలో భాగంగా శనివారం ఆర్‌బీవీఆర్‌ఆర్‌ రాష్ట్ర పోలీసు అకాడమీని సందర్శించారు. ఈ బృందంలోని ఉమాహారతికి ఆమె తండ్రి, పోలీసు అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు పుష్పగుచ్ఛం అందించి సరదాగా సెల్యూట్‌ చేయగా వారి మోముపై చిరుమందహాసం విరిసింది. ఆదివారం ఫాదర్స్‌ డే జరుపుకొంటున్న తరుణంలో ఒక రోజు ముందు ఈ ఘటన జరగడం విశేషం. శిక్షణ ఐఏఎస్‌లకు అకాడమీ జాయింట్‌ డైరెక్టర్‌ మురళీధర్, డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు స్వాగతం పలకగా మరో డిప్యూటీ డైరెక్టర్‌ సి.నర్మద అకాడమీ కార్యక్రమాలను వివరించారు.

Also Read : NEET 2024 Exams: నీట్‌ పేపర్‌ లీక్‌ లో బిహార్‌ ముఠా !

Leave A Reply

Your Email Id will not be published!