Gandhi Statue UNO : గాంధీ విలువలు నిలబడేలా చేశాయి
ఐక్య రాజ్య సమితి జీఎస్ గుటెర్రెస్
Gandhi Statue UNO : మహాత్మా గాంధీ బోధించిన విలువల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు ఐక్య రాజ్య సమితి చీఫ్ క్సాబా కొరోసీ. ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని(Gandhi Statue UNO) గురువారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ , యుఎన్ లో దేశ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుఎన్ చీఫ్ క్సాబా కొరోసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన యుఎన్ కు సంబంధించి 77వ అసెంబ్లీకి అధ్యక్షుడిగా ఉన్నారు.
ఈ సందర్భంగా ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ స్పందించారు. గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు. అంతే కాదు ఆయన సమర్థించిన విలువలను ఇది ఎల్లప్పటికీ గుర్తు చేస్తుందని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ శాంతియుత సహజీవనం, వివక్ష, బహువచనం కోసం రాజీ పడని న్యాయవాది అని పేర్కొన్నారు.
జాతిపిత గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు ఆంటోనియో గుటెర్రెస్. ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం తమను ఎప్పటికీ హెచ్చరిస్తూనే ఉంటుందన్నారు. విలువలే ప్రాతిపదికగా ప్రపంచం మనుగడ సాగించాలన్న గాంధీ బోధనలు ఎల్లప్పటికీ అనుసరణీయాలని పేర్కొన్నారు గుటెర్రెస్.
గాంధీ విగ్రహ ఆవిష్కర సందర్భంగా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీకి ఇష్టమైన వైష్ణవ్ జాన్ అనే భజన కూడా పఠించారు. ఈ విషయాన్ని స్వయంగా పంచుకున్నారు భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్.
Also Read : పాకిస్తాన్ పై నిప్పులు చెరిగిన జై శంకర్