Manish Tiwari : ష‌ర‌తులు లేని లొంగుబాటు మంచిదే

జై శంక‌ర్ పై మ‌నీష్ తివారీ సెటైర్

Manish Tiwari Jai Shankar : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి మ‌నీష్ తివారీపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విరుచుకు ప‌డింది. మీడియా సంస్థ ఏఎన్ఐ ఎడిట‌ర్ స్మితా ప్ర‌కాష్ తో మాట్లాడిన జై శంక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా ఆయ‌న కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు.

దివంగ‌త ప్ర‌ధాని ఇందిరా గాంధీని, చైనా దూకుడును, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌..ఇలా ప్ర‌తి అంశం గురించి ప్ర‌స్తావించారు. అంతే కాదు రాహుల్ గాంధీని వ్య‌క్తిగ‌తంగా దూషించారు. గ‌తంలో ఎన్న‌డూ అంతగా కామెంట్స్ చేయ‌ని జై శంక‌ర్ ఉన్న‌ట్టుండి తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

చైనా స‌రిహ‌ద్దు వ‌ద్ద‌కు ప్ర‌ధాన మంత్రి ఆర్మీ పంపించాడ‌ని కానీ రాహుల్ గాంధీ పంపించ లేదంటూ ఆరోపించారు. ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు మ‌నీష్ తివారీ స్పందించారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ష‌ర‌తులు లేని లొంగుబాటు కూడా మంచిదేన‌ని ఎద్దేవా చేశారు. అస‌లు జై శంక‌ర్(Manish Tiwari Jai Shankar)  ఎవ‌రి కోసం ప‌ని చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. ఒక బాధ్య‌త క‌లిగిన కేంద్ర మంత్రి ఇలా దిగ‌జారి మాట్లాడ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని నిల‌దీశారు.

చైనా ఒక పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ అని స‌రిహ‌ద్దు ఒప్పందాల‌ను ఉల్లంఘించ‌డం ద్వారా ల‌డ‌ఖ్ లోని వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ వెంట చైనాను ఎదుర్కొనేందుకు భార‌త్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్ప‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు మ‌నీష్ తివారీ. మంత్రి బేష‌ర‌తుగా లొంగి పోవ‌డాన్ని కూడా గొప్ప‌గా చెప్ప‌క పోతే మ‌రింత గౌర‌వంగా కూడా చెప్ప వ‌చ్చంటూ ఎద్దేవా చేశారు.

Also Read : కాంగ్రెస్ నేత‌లు చ‌ట్టానికి అతీతం కాదు

Leave A Reply

Your Email Id will not be published!