Undavalli Arun Kumar : చంద్రబాబుపై ఉండవల్లి పిల్
42 మందిపై హైకోర్టులో రిట్ పిటిషన్
Undavalli Arun Kumar : రాజమండ్రి – మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై దర్యాప్తు జరపాలని కోరుతూ ఉండవల్లి రిటి పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో.
ఈ కేసుకు సంబంధించి 44 మందిని ప్రతివాదులుగా చేర్చారు మాజీ ఎంపీ. రిట్ నెంబర్ 38371/2023 ప్రకారం హైకోర్టు రిజిస్ట్రార్ నమోదు చేసారు. కేంద్ర ప్రభుత్వం, సిబిఐ, ఈడీ లను కూడా ప్రతివాదులుగా చేర్చడం సంచలనం కలిగించింది.
Undavalli Arun Kumar Apill
ఉండవల్లి అరుణ్ కుమార్(Undavalli Arun Kumar) దాఖలు చేసిన పిటిషన్ లో కేంద్ర సర్కార్ , సీబీఐ, ఈడీ, ఏపీ సర్కార్ , ఏపీ సీఐడీ, గంటా సుబ్బారావు, డాక్టర్ కొడిదెల లక్ష్మీ నారాయణ, నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్ , డిజైన్ టెక్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ ను చేర్చారు. వీరితో పాటు స్కిల్లార్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ , సౌమ్యాద్రి శేఖర్ బోస్ (సుమన్ బోస్ ) , ప్రతాప్ కుమార్ కార్ , వికాస్ వినాయక్ కన్వల్కర్ , సంజయ్ దాగా, ముకుల్ చంద్ అగర్వాల్ , సౌరబ్ గార్గ్ , హిర్దికంజి పటేల్ , శిరీష్ చంద్రకాంత్ షా ఉన్నారు.
పాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ డైరెక్టర్స్ , ఐటీ స్మిత్ సర్వీసెస్ డైరెక్టర్స్ , ఇన్వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ , సుమన్ బోస్ అండ్ సీమన్స్ ప్రాజెక్టు టీం మెంబర్స్ , డైరెక్టర్ ఆఫ్ నాలెడ్జ్ పోడియం, డైరెక్టర్స్ ఆఫ్ టేలెంట్ ఎడ్జ్ , సురేష్ గోయల్ , మనోజ్ కుమార్ జైన్ , యోగేష్ గుప్తా, సీతారాం అరోరాను చేర్చారు ఉండవల్లి అరుణ్ కుమార్.
వీరితో పాటు సౌరబ్ గుప్తా, విపిన్ కుమార్ శర్మ, సవన్ కుమార్ తోలారాం జాజూ, అలియడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఇండియా లిమిటెడ్ , నీలం శర్మ, భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా లిమిటెడ్ , రాకేష్ భాటియా, షాఫాలి అగర్వాల్ , కాడిన్ పార్టనర్స్ ఫోరం, ఇటా గ్రీన్ బిల్ట్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ , పోలారిస్ సాఫ్ట్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ , గంటి వెంకట సత్య భాస్కర ప్రసాద్ ఉన్నారు.
అపర్ణా ఉపాధ్యాయుల ఐఏఎస్ , నారా చంద్రబాబు నాయుడు, కింజారపు అచ్చయ్యనాయుడు, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను కూడా ప్రతివాదులుగా చేర్చారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.
Also Read : Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.77 కోట్లు