TS Govt Jobs : నోటిఫికేషన్లు సరే కొలువుల జాడేది
ఆర్భాటంగా ఆర్థిక శాఖ అనుమతి
TS Govt Jobs : ఓ వైపు ఎన్నికల కోలాహాలం. మరో వైపు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయినా ఇంకా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలను(TS Govt Jobs) భర్తీ చేయలేదు. లెక్కకు మించి ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని తేల్చి చెప్పింది.
అన్నింటిని కలిపి కేవలం 82 వేల జాబ్స్ మాత్రమే ఉన్నాయంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆ వెంటనే నోటిఫికేషన్లు ఇస్తారని, త్వరలోనే భర్తీ చేస్తామన్నారు ఆర్భాటంగా. కానీ ఉప ఎన్నికలుల ముగిశాయి. అదిగో భర్తీ చేస్తాం..ఇదిగో నోటిఫికేషన్లు అంటూ ఊరిస్తూ వస్తోంది.
ఇక ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చినా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కు సంబంధించి నియామకం జరగలేదు. అన్ని శాఖల్లో లెక్కకు మించి ఖాళీలు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TS Govt Jobs) నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షపై అనుమానాలు ఉన్నాయంటూ కోర్టుకు ఎక్కారు. ఇక ప్రస్తుతం ప్రకటించబోయే నోటిఫికేషన్లపై కూడా ఆశలు అడుగంటి పోయాయి.
ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తిగా విశ్వాసం కోల్పోయారు నిరుద్యోగులు. టీఎస్సీపీఎస్సీకి భర్తీ ప్రక్రియ చేత కాదన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం ఆయా సంస్థలు లేదా జిల్లా స్థాయిలలో భర్తీ ప్రక్రియ చేపడితే బాగుంటుందని బాధితులు కోరుతున్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కోరి తెచ్చుకున్న తెలంగాణలో ప్రస్తుతం కొలువులు అందని ద్రాక్ష పండు లాగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆర్థిక శాఖ 61,804 పోస్టుల భర్తీకి పర్మిషన్ ఇచ్చింది. ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు.
Also Read : తెలంగాణ రాష్ట్రం అభివృద్దికి సోపానం