Union Budget 2023 : నిర్మలమ్మ ఎన్నికల బడ్జెట్
సీనియర్లకు కాస్తంత ఊరట
Union Budget 2023 : ఎంతో ఉత్కంఠ రేపుతూ వచ్చిన కేంద్ర బడ్జెట్ బుధవారం ప్రవేశ పెట్టింది విత్త మంత్రి నిర్మలా సీతారామన్. కొందరికి మేలు చేకూర్చేలా మరికొందరిని పక్కన పెట్టేలా ఉంది. కీలకమైన వ్యవసాయ రంగానికి రుణ సాయం ప్రకటించారు. కానీ ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సాయం ఊసెత్త లేదు. అంతే కాదు పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేదు. ఇక పన్ను చెల్లింపు దారులకు ఆత్రం ఊరట లభించింది.
ఆదాయ పన్ను మినహాయింపు రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు పెంచింది. దీని వల్ల కోట్లాది మందికి ఊరట లభించింది. ఉపాధి రంగానికి ప్రయారిటీ ఇచ్చింది నిర్మలమ్మ. కొత్తగా నర్సింగ్ కాలేజీలు, పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేలా ఉంది. వ్యవసాయ రంగానికి డిజిటల్ సొబగులు అద్దనుంది. కానీ ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు సాయం ఊసే లేదు. గోవర్దన్ పథకం కింద 500 కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు(Union Budget 2023).
కోటి మంది రైతులకు సహజ వ్యవసాయంపై శిక్షణ ఉంటుది. హస్త కళాకారులకు పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ ప్యాకేజీ వర్తింప చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మలా సీతారామన్. మత్స్య సంపద యోజనలో రూ. 6,000 కోట్లు. పీఎంపీబీటీజీ కింద 15,000 వేల కోట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
టీచర్ల కోసం ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు. ఏఐ కోసం ఎక్సలెన్స్ సెంటర్లు. పంచాయతీలు, వార్డుల్లో లైబ్రరీలు ఏర్పాటు. 30స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. 5జీ యాప్ ల తయారీకి 100 ల్యాబ్ ల ఏర్పాటు . ఇంధన భద్రత రంగంలో రూ. 35 వేల కోట్ల పెట్టుబడి. వాహనాల స్క్రాపింగ్ కు నిధులు. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇ చ్చేలా ఉంది బడ్జెట్(Union Budget 2023).
Also Read : కర్ణాటకకు మోదీ నజరానా