Law Panel Extends : లా ప్యానెల్ పదవీ కాలం పొడిగింపు
ఆగస్టు 2024 వరకు కేంద్రం నిర్ణయం
Law Panel Extends : కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లా ప్యానెల్ పదవీ కాలాన్ని ఆగస్టు , 2024 వరకు పొడిగించింది. ఇదిలా ఉండగా చట్ట బద్దత లేని సంస్థ లా కమిషన్ మొదటిసారిగా 1955లో ఏర్పాటైంది. అప్పటి నుండి చట్టాన్ని క్రోడీకరించడం ద్వారా ఎప్పటికప్పుడు పునర్ నిర్మించబడింది. 22వ లా కమిషన్ ఆఫ్ ఇండియా పదవీ కాలాన్ని ఆగస్టు 31 వరకు పొడిగించేందుకు కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది.
ఇప్పటి వరకు లా కమిషన్ కు సంబంధించి 277 నివేదికలను సమర్పించింది. ప్రస్తుతం ఉన్న లా కమిషన్ ఫిబ్రవరి 20 వరకు మాత్రమే కాల పరిమితి ఉంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మోదీ సర్కార్ ఆమోదం తెలపాల్సి వచ్చింది. ఇప్పటికే కేంద్రం వర్సెస్ సుప్రీంకోర్టు మధ్య దూరం ఎక్కువైంది. ఈ సందర్భంగా కేంద్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. 22వ లా కమిషన్ చైర్ పర్సన్ , సభ్యులు ఇటీవలి కార్యాలయంలో చేరారు.
పని పురోగతిలో ఉన్నందున , పరిశీలన , నివేదిక కోసం అనేక పెండంగ్ ప్రాజెక్టులను చేపట్టారు. అందుకే పదవీ కాలం(Law Panel Extends) పొడిగించినట్లు స్పష్టం చేసింది కేంద్రం. ఈ లా కమిషన్ చట్టాలను గుర్తించడం కొనసాగిస్తుంది. ఇక పై వాడుకలో లేని , అనవసరమైన చట్టాలను రద్దు చేయాలని సిఫార్సు చేస్తాయి. ఆదేశిక సూత్రాలను అమలు చేసేందుకు ,రాజ్యాంగ ప్రవేశికలోని లక్ష్యాలను సాధించేందుకు కొత్త చట్టాన్ని రూపొందించాలని సూచిస్తుంది.
ఇదిలా ఉండగా కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రితురాజ్ అవస్తీ గత ఏడాది నవంబర్ 7న ప్యానెల్ హెడ్ గా బాధ్యతలు స్వీకరించారు.
Also Read : ఢిల్లీ పీఠంపై షెల్లీ..ఇక్బాల్