Andhra Pradesh Debt : ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్ప – కేంద్రం
రూ. 3,60,333.4 కోట్లు వెల్లడి
Andhra Pradesh Debt : కేంద్ర సర్కార్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర బండారాన్ని బయట పెట్టింది. ఆ రాష్ట్రానికి ఎన్ని కోట్ల అప్పులు ఉన్నాయో అంకెలతో సహా వెల్లడించింది. తలుచుకుంటేనే భయం కలిగించేలా సంఖ్యలు ఉన్నాయి. అందుకే ఏపీ రాష్ట్రం అప్పుల కుప్పలో దూసుకు పోతోందని కేంద్రం స్పష్టం చేసింది.
ఒక రకంగా హెచ్చరించింది. ఆ రాష్ట్రానికి సంబంధించి (Andhra Pradesh Debt) రూ. 3,60,333.4 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొంది. ప్రతి ఏటా అప్పులు పెంచుకుంటూ పోతోందని, దానిని నివారించేందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలిపింది. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ఎంపీలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్రం ఇవాళ కీలక ప్రకటన చేసింది. రాత పూర్వకంగా సమాధానం తెలిపింది. బడ్జెట్ లెక్కల పరంగా చూస్తే 2018లో ఏపీ రాష్ట్ర అప్పు రూ. 2,29,333.8 కోట్లు ఉండగా ఇప్పటి వరకు చూస్తే ఏకంగా మరింత పెరిగిందని హెచ్చరించింది.
అది కాస్తా మూడేళ్లలో రూ. 3,60,333.4 కోట్లకు చేరిందని స్పష్టం చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. అభివృద్దిపై ఫోకస్ పెట్టడం లేదని కానీ అప్పులు చేయడంలో దూసుకు పోతోందంటూ ఎద్దేవా చేసింది. 2020-21 నాటికి అప్పుల శాతం గణనీయంగా పెరిగిందని పేర్కొంది. అది 17.1 శాతంగా ఉందని తెలిపింది.
రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి లోనూ అప్పుల శాతం అంతకంతకూ అనకొండ లాగా పెరుగుతోందంటూ హెచ్చరించింది. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయడం కూడా తడిసి మోపెడు అవుతుందనేది వాస్తవం.
Also Read : విజయసాయి రెడ్డికి ‘ప్యానల్’ ఛాన్స్